హైదరాబాద్ నగరంలోని ఓ బిల్డింగ్ యజమాని తన ఇంటిని కొన్ని అడుగులు పైకి లేపాలని అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నది జరగకపోగా.. ఇంటినే కూల్చేయాలని అధికారులు అనుకుంటూ ఉన్నారు. తనకు ఉన్న రెండంతస్థుల(జీ+2) ఇంటిని హైడ్రాలిక్ జాక్‌లతో కొన్ని అడుగులు ఎత్తాలని ప్రయత్నించగా.. ఆ ప్రయోగం కాస్తా బెడిసి కొట్టింది.
హైదరాబాద్: హైదరాబాద్(Hyderabad) నగరంలోని ఓ బిల్డింగ్(Building) యజమాని తన ఇంటిని కొన్ని అడుగులు పైకి లేపాలని అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నది జరగకపోగా.. ఇంటినే కూల్చేయాలని అధికారులు అనుకుంటూ ఉన్నారు. తనకు ఉన్న రెండంతస్థుల(జీ+2) ఇంటిని హైడ్రాలిక్ జాక్‌లతో కొన్ని అడుగులు ఎత్తాలని ప్రయత్నించగా.. ఆ ప్రయోగం కాస్తా బెడిసి కొట్టింది.. దీంతో ఆ అపార్ట్‌మెంట్ పూర్తిగా దెబ్బతింది. భవనం ఎత్తు పెంచేందుకు అతడు చేసిన ప్రయత్నంలో అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్ ఫ్లోర్ దెబ్బతినడంతో పక్కనే ఉన్న భవనంపైకి వాలింది. ఈ ఘటన శనివారం రాత్రి హైదరాబాద్‌లోని చింతల్(Chinthal)లోని జీడిమెట్ల(Jeedimetla) శ్రీనివాసనగర్(Srinivasa Nagar)లో చోటుచేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) భవనాన్ని పరిశీలించింది.
రోడ్డు కిందకు ఉందని ఇంటిని జాకీలు పెట్టి లేపాలని చూస్తే ప్లాన్ బెడిసికొట్టింది
హైదరాబాద్ - చింతల్లో తన ఇల్లు రోడ్డు కంటే కిందకి ఉందని ఓ ఇంజనీర్ సహాయంతో హైడ్రాలిక్ జాకీలతో భవనాన్ని పైకి లేపే ప్రయత్నం చేసిన ఇంటి యజమాని. 8 పోర్షన్లలో కిరాయికి ఉన్న వారు ఇంట్లో వుండగానే విచిత్ర… pic.twitter.com/mTlXHL1BgA
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2023
స్థానికుల కథనం ప్రకారం.. శ్రీనివాసనగర్‌లో ఇంటి యజమాని నాగేశ్వరరావు(Nageshwar Rao) 25 ఏళ్ల క్రితం ఇంటిని నిర్మించుకున్నాడు. వచ్చే వర్షాకాలంలో ఇంట్లోకి వర్షపు నీరు చేరకుండా ఉండేందుకు యజమాని తన భవనాన్ని ఎత్తేందుకు విజయవాడ(Vijayawada)లోని హౌస్ లిఫ్టింగ్ కంపెనీ(House Lifting Company)ని సంప్రదించాడు. ఇటీవలి కాలంలో రోడ్ల హైట్(Raod Height) పెంచడంతో వర్షపు నీరు(Rain Water) అతని భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోకి ప్రవేశించడం మొదలైంది. 2022 రుతుపవనాల సమయంలో అత్యధిక వర్షపాతం, వరదలను చూసిన ప్రాంతాలలో కుత్బుల్లాపూర్ కొయిదా ఒకటి. నాలా డ్రెయిన్ నీటితో ఆ ప్రాంతంలోని చాలా భవనాలు మునిగిపోయాయి. అయితే, నాగేశ్వరరావు తన బిల్డింగ్ ఎత్తును పెంచడం కోసం ప్రయత్నాలను మొదలుపెట్టాడు.. GHMC టౌన్ ప్లానింగ్ విభాగం నుండి ఎటువంటి అనుమతి తీసుకోలేదు.ఈ భవనంలో యజమానితో సహా మొత్తం ఆరు కుటుంబాలు నివసిస్తున్నాయి. ట్రైనింగ్ పనులు ప్రారంభం కాగానే నాలుగు కుటుంబాలు భవనాన్ని ఖాళీ చేయగా, యజమానితో పాటూ మరో కుటుంబం అదే భవనంలో ఉంటున్నారు. అయితే లిఫ్టింగ్ ఆపరేషన్‌లో ఇంజనీర్లు విఫలమయ్యారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ దెబ్బతినడంతో భవనం పక్కనే ఉన్న భవనంపైకి వాలింది. వెంటనే అపార్ట్‌మెంట్‌లో నివసించే వాళ్లను తరలించామని జిహెచ్‌ఎంసిలోని కుత్బుల్లాపూర్‌లోని టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ కమిషనర్ సాంబయ్య అన్నారు. “రెండు భవనాలు పాతవి, హైడ్రాలిక్ జాక్‌లను ఉపయోగించి లిఫ్టింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి తగినంత బలంగా లేవు. దీంతో అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది" అని పట్టణ ప్రణాళిక అధికారి తెలిపారు. అనుమతులు తీసుకోకపోవడంతో నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశారు.
ఆదివారం ఉదయం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద(Vivekananda) ఈ ప్రాంతాన్ని సందర్శించి భవనాన్ని కూల్చివేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. “యజమాని ఎటువంటి సాంకేతిక నిపుణుల సంప్రదింపులు తీసుకోలేదు, ఇది పొరపాటు. ఈ ప్రాంతం వ్యవసాయ భూమి, ఇక్కడ మట్టి వదులుగా ఉంటుంది. హౌస్ లిఫ్టింగ్ కంపెనీ పనులు ప్రారంభించే ముందు ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేయలేదు" అని ఎమ్మెల్యే అన్నారు. "JNTU నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంది. పరిస్థితిని పర్యవేక్షించి ఎలా కొనసాగించాలో మాకు సూచనలు ఇస్తుంది" అని ఎమ్మెల్యే తెలిపారు.
భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయం:
ఈ ప్రాంతాన్ని పరిశీలించిన టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ కమిషనర్ సాంబయ్య(Sambaiah), నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఇంటిని కూల్చివేసే అవకాశం ఉందని చెప్పారు. "మేము చుట్టుపక్కల ఉన్న స్థానికులను ఖాళీ చేయించాం. మిగిలిన పనులు ఎలా చేయాలో పరిశీలిస్తున్నాము," అని అన్నారు.
ఇళ్లు ఎత్తడం ఎలా?
హౌస్ లిఫ్టింగ్, దీనిని హౌస్ జాకింగ్(House Jacking) అని కూడా పిలుస్తారు. ఇది ఒక భవనాన్ని దాని పునాది నుండి వేరు చేసి హైడ్రాలిక్ స్క్రూ జాక్‌ల(Hydraulic screw jacks) తో హైట్ పెంచే ప్రక్రియ. గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోరింగ్ మొదట తొలగిస్తారు.. గోడల వెంట ఒక చిన్నగా తవ్వుతారు. జాక్‌లు వేసి, భవనం నెమ్మదిగా పైకి లేపుతారు. ఒక ఇంటిని పెంచి, క్రిబ్బింగ్‌పై మద్దతు ఇచ్చిన తర్వాత, దాని కింద కొత్త పునాదిని నిర్మించవచ్చు. 1,200 చదరపు అడుగుల ఇంటిని మూడు అడుగుల మేర ఎత్తడానికి దాదాపు 30-45 రోజులు పడుతుంది.
ప్రమాదకరమే:
ఇది ప్రమాదకర వ్యవహారం. భవనం దృఢంగా ఉండేలా చూసుకోవాలి. ముందస్తు అనుమతులు తీసుకోవాలి. ఇది కూడా ఖరీదైనది, భవనాన్ని బట్టి దాదాపు రూ.4-5 లక్షలు ఖర్చవుతుంది. వర్షాల సమయంలో వరదలకు గురయ్యే నగరాల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది ఖరీదైనది, కానీ వర్షాకాలంలో తీవ్ర వరదలను ఎదుర్కొనే నివాసితులు కూల్చివేసి కొత్త ఇంటిని నిర్మించడానికి ఉత్తమ ప్రత్యామ్నాయంగా లిఫ్టింగ్‌ని కనుగొంటారు. భారతదేశంలో, పూణె(Pune), బెంగళూరు(Banglore), విశాఖపట్నం(Visakhapatnam) వంటి నగరాలలో హౌస్-లిఫ్టింగ్ పనులు చాలానే జరిగాయి.
న్యూయార్క్, న్యూజెర్సీ వంటి నగరాల్లో కూడా హౌస్ లిఫ్టింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంది. యునైటెడ్ స్టేట్స్‌లో, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (FEMA) వంటి ఏజెన్సీలు అనువుగా ఉండే ప్రాంతాల్లో ఇళ్లను కావలసిన ఫ్లడ్ ప్రొటెక్షన్ ఎలివేషన్ (FPE)కి పెంచాలని సలహా ఇస్తున్నాయి. బేస్ ఫ్లడ్ ఎలివేషన్ (BFE)ని లెక్కించడం ద్వారా యజమానులు తమ ఇళ్లను ఏ పాయింట్‌కి ఎలివేట్ చేయాలో కూడా వారు నిర్ణయిస్తారు.
ఇంతకు ముందు ఎక్కడెక్కడ జరిగాయి:
2022లో మంచిర్యాలలో ఓ ఇంటి యజమాని తన ఇంటిని 6 అడుగుల మేర ఎత్తేశాడు. అతని G+1 ఇల్లు 2013లో నిర్మించారు. ఇంటి ముందు రోడ్డు నిర్మాణం కారణంగా గ్రౌండ్ ఫ్లోర్ క్రమంగా తగ్గిపోయింది. అతను హౌస్ లిఫ్టింగ్ చేయించి విజయం సాధించాడు. 2022లో, హైదరాబాద్ నగరంలోని చాలా ఇళ్లు గ్రౌండ్ ఫ్లోర్‌లో నీటితో నిండిపోవడంతో, ఒక ఇంటి యజమాని హౌస్ లిఫ్టింగ్ చేపట్టాడు. బెంగళూరులో వరదల కారణంగా సౌమ్య అనే మహిళ ఇల్లు కట్టడం కంటే హౌస్ లిఫ్టింగ్ చౌకైన ఎంపిక అని భావించి ఆ విధంగా అనుకున్నది చేయించుకుంది. 2015లో, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీలో ఒక ఇల్లు జాక్‌లను ఉపయోగించి ఇంటిని ఆరు అడుగుల ఎత్తు పెంచారు. అందులో విజయం సాధించడంతో అప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో కూడా హౌస్ లిఫ్టింగ్ బాగా ప్రాచుర్యం పొందింది.