ఉద్యోగానికి తాను రాజీనామా(Resign) చేయబోతున్నాననీ, వీఆర్‌ఎస్(VRS) కోసం దరఖాస్తు చేసుకున్నాననీ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు(Srinivasa Rao). తాను ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా మీడియాకు తెలియచేస్తానని చెప్పారు.
ఉద్యోగానికి తాను రాజీనామా(Resign) చేయబోతున్నాననీ, వీఆర్‌ఎస్(VRS) కోసం దరఖాస్తు చేసుకున్నాననీ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు(Srinivasa Rao). తాను ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా మీడియాకు తెలియచేస్తానని చెప్పారు. కొత్తగూడెంలో(Kotha gudem) ప్రజలకు సేవ చేయడానికి తన వంతు కృషి చేస్తున్నానని, రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రస్తుతం పనిచేస్తున్నానని ఆయన అన్నారు. అందరూ కోరుకుంటున్నట్టుగా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కేసీఆర్ ఆదేశిస్తే మాత్రం బరిలో దిగుతానని చెప్పారు. అప్పటి వరకు అసత్య ప్రచారాలు చేయవద్దని శ్రీనివాసరావు విన్నవించుకున్నారు.