పబ్జీకి(Pubg) మరో యువకుడు బలయ్యాడు. ఈ మధ్య కాలంలో పబ్జీ పిచ్చి పట్టి ఎందరో యువతీయువకులు ప్రాణాలు కోల్పోతున్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని యువతనూ ఈ పబ్జీ పీడ వదలట్లేదు. తన గేమ్‌కు బానిసయ్యి, మతిస్థిమితం కోల్పోయి.. చివరికి ఓ యువకుడి ప్రాణాలను సైతం బలితీసుకుంది ఈ పబ్జీ. పబ్జీ గేమ్‌కు బానిసై ఏడాది క్రితం మానసిక స్థితి(Mental health) కోల్పోయిన ఓ యువకుడు సెల్‌ టవర్‌(Cell Tower) పైనుంచి పడి మృతిచెందాడు.

పబ్జీకి(Pubg) మరో యువకుడు బలయ్యాడు. ఈ మధ్య కాలంలో పబ్జీ పిచ్చి పట్టి ఎందరో యువతీయువకులు ప్రాణాలు కోల్పోతున్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని యువతనూ ఈ పబ్జీ పీడ వదలట్లేదు. తన గేమ్‌కు బానిసయ్యి, మతిస్థిమితం కోల్పోయి.. చివరికి ఓ యువకుడి ప్రాణాలను సైతం బలితీసుకుంది ఈ పబ్జీ. పబ్జీ గేమ్‌కు బానిసై ఏడాది క్రితం మానసిక స్థితి(Mental health) కోల్పోయిన ఓ యువకుడు సెల్‌ టవర్‌(Cell Tower) పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌(Muthnur) గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవాపూర్‌ గ్రామానికి చెందిన దుర్వ జగదీశ్‌–మోహన్‌బాయి దంపతుల కుమారుడు వికాస్‌(vikas)(19) ఇంటర్‌ మధ్యలోనే మానేశాడు. పబ్జీ గేమ్‌కు అలవాటు పడి ఇంట్లోనే ఉంటూ ఏడాది క్రితం మానసిక స్థితి కోల్పోయాడు.శనివారం రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కుటుంబసభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. రాత్రి దేవాపూర్‌ నుంచి ముత్నూర్‌ గ్రామానికి చేరుకొని గ్రామ సమీపంలో ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కి పైనుంచి కింద పడి మృతిచెందాడు. గ్రామస్తులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మానసిక స్థితి సరిగా లేక సెల్‌టవర్‌ ఎక్కి పైనుంచి పడిపోవడంతోనే మృతిచెందినట్లు నిర్ధారించారు. తల్లి మోహన్‌బాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated On 7 Nov 2023 12:00 AM GMT
Ehatv

Ehatv

Next Story