గవర్నర్ కోటా కింద ప్రొఫెసర్ కోదండరాంను(Professor Kodandaram) ఎమ్మెల్సీగా(MLC) రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందుకు గవర్నర్ తమిళసై(Tamilsai) కూడా ఆమోదం తెలిపారు.

Professor Kodandaram
గవర్నర్ కోటా కింద ప్రొఫెసర్ కోదండరాంను(Professor Kodandaram) ఎమ్మెల్సీగా(MLC) రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందుకు గవర్నర్ తమిళసై(Tamilsai) కూడా ఆమోదం తెలిపారు. అయితే గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో నామినేట్ చేసిన వారిని ఆమోదించకుండా.. కాంగ్రెస్(Congress) ప్రతిపాదించిన వారికి గవర్నర్ ఆమోదం తెలపడంపై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో కోదండరాం స్పందిస్తూ.. తాను సుదీర్ఘ కాలం సేవలు చేశానని.. కాబట్టి తన ఎమ్మెల్సీ పదవిపై వివాదం సరికాదని కోదండరాం విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగపరంగా సేవ చేసిన వాళ్లకు అవకాశం ఇస్తారన్నారు. తాను సుదీర్ఘ కాలం సేవ చేసినందువల్ల వివాదం వద్దని కోరారు. ప్రజలకు అన్నీ తెలుసునని.. వారే అన్ని అంశాలను అంచనా వేసుకుంటారని పేర్కొన్నారు. రాజ్యాంగంలో షరతులు అర్థమైతే తన ఎమ్మెల్సీ పదవిపై చర్చ ఉండదని సూచించారు. జాగ్రత్తగా రాజ్యాంగం చదివితే వివాదం ఉండదన్నారు.
