బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) మంత్రి కొండా సురేఖ(Konda surekha) వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) మంత్రి కొండా సురేఖ(Konda surekha) వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రజలు చీదరించుకుంటున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇంత దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదంటున్నారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి(Ganta chakrapani) కూడా రియాక్టయ్యారు. ఎక్స్ ద్వారా సురేఖకు చురకలు అంటించారు. 'ఆ సంగతి మీకెవరు చెప్పారు సురేఖ గారూ.? వాళ్ల విడాకుల పత్రంలో ఆ వివరాలు ఉన్నాయా? రాష్ట్రమంత్రిగా ఒక బాధ్యాతాయుతమైన స్థానం లో ఉన్న మీరే ఒక ప్రముఖ నటి వ్యక్తిగత జీవితాన్ని ఇలా బజారుకు ఈడ్చి మాట్లాడితే ఎలా. ఎవరో ముక్కూమొహం తెలియని వాళ్లు ఏదో రాశారని బాధ పడ్డారు. ఆ బాధ సహజమే, కానీ సాటి మహిళల్ని మీరే గౌరవించనప్పుడు అదే గౌరవాన్ని ఆశించడం అత్యాశే కదా!
మీరు మాట్లాడిన మాటలను ప్రతిపక్షాల, మీరంటే గిట్టని వాళ్ళో కాదు స్వయంగా మీ పార్టీ ఇలా ప్రచారం చేయడం ఆశ్చర్యంగా ఉంది. మహిళ ల శీలహననం ఎవరు చేసినా తప్పే. అధికార బాధ్యతల్లో ఉండి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లు ఏది మాట్లాడినాఎదురు మాట్లాడవద్దు అంటే కుదరదు.
యధారాజా!
తధా ప్రజ!!'