సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లో, నేను చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరైనా హర్ట్ అయ్యుంటే క్షమాపణ కోరుతున్నానని దిల్ రాజు అన్నారు.
సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లో, నేను చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరైనా హర్ట్ అయ్యుంటే క్షమాపణ కోరుతున్నానని దిల్ రాజు అన్నారు. నిజామాబాద్ జిల్లా వాసిగా తన సినిమా ఈవెంట్ అక్కడ చేశానని వేడుకలో తాను మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి మాట్లాడానన్నారు. తెలంగాణ ప్రజలను తాను అవమానించానని, హేళన చేశానంటూ తనపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. తెలంగాణ సంస్కృతిని తాను అభిమానిస్తానని ఎవరి మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు. తెలంగాణ సంస్కృతి ఆధారంగా రూపొందించిన బలగం సినిమాను తెలంగాణ సమాజం మొత్తం ఆదరించింది. అన్నీ రాజకీయ పార్టీలు ఈ చిత్రాన్ని అభినందించాయి. బాన్సువాడలోనే ఫిదా సినిమాను తెరకెక్కించాం. ఆ చిత్రం తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసింది. తెలంగాణ వాసిగా నేను రాష్ట్రాన్ని ఎలా హేళన చేస్తానని దిల్ రాజు అన్నారు. కాగా వెంకటేశ్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నిజామాబాద్‌లో తెలంగాణ వాళ్లు సినిమాకు వైబ్ ఇవ్వరని.. ఏపీ ప్రజలయితే సినిమాలకు వైబ్ ఇస్తారన్నారు. తెలంగాణలో తెల్లకల్లు, మటన్‌కే వైబ్ ఇస్తారని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇవ్వడంతో పాటు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.