కడపజిల్లా ప్రొద్దుటూరు తెలులుగేదశంలో నాలుగు స్తంభాలాట మొదలైంది. ఎన్నికలకు రెండు నెలల ముందే ఇక్కడ టికెట్ రేసు మొదలైంది. అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి(Rachamallu Shivapradadreddy) ఉండగా..టీడీపీ తరఫున అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొంది. టికెట్ నీదా నాదా అన్న రేంజ్లో ఆ నలుగురు పోటీపడుతున్న సమయంలో అనూహ్యాంగా సీఎం సుమేష్(cm suresh) పేరు తెరపైకి వచ్చింది. ఇంతకీ..ప్రొద్దుటూరులో పోటీ చేయబోయే అసలు అభ్యర్థి ఎవరు అనేదానిపై నియోజకవర్గంలో అసక్తికర చర్చ మొదలైంది.

ఎన్నికలకు మరో రెండు నెలల సమయమే ఉండటంతో ఆశావహులు సీటుపై ఖర్చిఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా కడపజిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం(Proddatur Constituency)లో టీడీపీలో టికెట్ పోరు గట్టిగానే ఉంది. ఇక్కడ పోటీ చేసేందుకు నలుగురు ఆశావహులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యేల(Ex Mla) వరదరాజులు రెడ్డి(Varadarajulu Reddy), లింగారెడ్డిలు(Lingareddy)..టికెట్ తనదంటే తనదంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో వరుస విజయాలు సాధించిన వరదరాజులురెడ్డి రాజకీయంగా సీనియర్. ఆయనకు ప్రొద్దుటూరులో బలమైన కేడర్ కూడా ఉంది. లింగారెడ్డికి కేడర్ అంతగా లేదని తెలుస్తోంది. మరో నేత ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జీ ( Proddutur Constituency TDP in-charge) ప్రవీణ్ కుమార్ రెడ్డి(Praveen Kumar Reddy). కష్టకాలంలో అండగా నిలబడి..పార్టీ కోసం జైలుకు కూడా వెళ్లానని అంటున్నారు. నియోజకవర్గ పర్యటనలో అధినేత చంద్రబాబు (chandrababu), యువనేత లోకేష్(Lokesh) టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఇలా ముగ్గురు నేతల మధ్య త్రిముఖ పోరు నడుస్తున్న సమయంలో..నేను సైతం టికెట్ రేసులో ఉన్నానంటూ తెరపైకి వచ్చారు సీఎం సురేష్(cm suresh). రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్(cm ramesh) సోదరుడు సీఎం సురేష్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తన సోదరుడు సీఎం రమేష్ కు అధినేత చంద్రబాబుతో సత్సంబంధాలు ఉండటంతో టికెట్ నాదేనని చెప్పుకుంటున్నారట. మొత్తానికి టికెట్ వరించే అదృష్టవంతుడు ఆ నలుగురిలో ఎవరనేదానిపై ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.