ఈ నెల 8న సరూర్ నగర్‏(Saroornagar) లో కాంగ్రెస్(congress) యువ సంఘర్షణ సభ నిర్వహించనుంది.. ఈ సభకు ప్రియాంక గాంధీ(Priyanka gandhi) హాజరు కానున్న నేపథ్యంలో గాంధీభవన్(Gandhi Bhavan) లో సన్నాహక సమావేశం నిర్వహించారు టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy).

ఈ నెల 8న సరూర్ నగర్‏(Saroornagar) లో కాంగ్రెస్(congress) యువ సంఘర్షణ సభ నిర్వహించనుంది.. ఈ సభకు ప్రియాంక గాంధీ(Priyanka gandhi) హాజరు కానున్న నేపథ్యంలో గాంధీభవన్(Gandhi Bhavan) లో సన్నాహక సమావేశం నిర్వహించారు టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy). సభలో అనుసరించాల్సిన విధానాలు, ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాట్లాడాల్సిన అంశాలపై నేతలతో చర్చించారు..

అక్టోబర్‏లో తెలంగాణకు ఎన్నికలు జరగనున్నాయి.. అయితే సరూర్ నగర్‏లో జరగబోయే సభలో పార్టీ కార్యాచరణ, మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొన్నటి దాకా అంతర్గత కుమ్ములాటతో డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కొద్దిగా దారికి వచ్చినట్టు కనిపిస్తుంది.. గతనెలలో నల్గొండలో జరిగిన నిరుద్యోగ సభలో పార్టీ నేతలంతా ఒక్కటై ప్రభుత్వంపై విమర్శలు చేశారు..

ఇదే తరహాలో రాబోయే రోజుల్లో కలిసి పోరాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామని నేతలు చెబుతున్నారు.. ఇక ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, గ్రేటర్ పరిధిలోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర నేతలు పాల్గొన్నారు.

Updated On 6 May 2023 2:38 AM GMT
Ehatv

Ehatv

Next Story