500 రూపాయలకే ఎల్‌పిజి సిలిండర్ల సరఫరా, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా వంటి రెండు ఎన్నికల హామీలను తమ ప్రభుత్వం ఫిబ్రవరి 23న ప్రారంభిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు

500 రూపాయలకే ఎల్‌పిజి సిలిండర్ల సరఫరా, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌(Free Electricity) సరఫరా వంటి రెండు ఎన్నికల హామీలను తమ ప్రభుత్వం ఫిబ్రవరి 23న ప్రారంభిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తెలిపారు. 27వ తేదీన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రా ఈ ప‌థ‌కాల‌ను ప్రారంభిస్తార‌ని వెల్ల‌డించారు.

రాష్ట్రంలో జరుగుతున్న ‘సమ్మక్క సారక్క జాతర’ను జాతీయ పండుగగా గుర్తించాలన్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించడం లేదని.. ఇది తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న‌ “వివక్ష, నిర్లక్ష్యం” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ములుగు జిల్లా మేడారంలో గిరిజనుల మెగా పండుగ సందర్భంగా దేవతలకు పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు.

"ఆరు ఎన్నికల హామీలలో, మేము 27 (ఫిబ్రవరి) సాయంత్రం రెండింటిని ప్రారంభించబోతున్నాము," అని ఆయన చెప్పారు. 500 రూపాయలకే ఎల్‌పిజి సిలిండర్ల సరఫరా, తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా ఫిబ్రవరి 27న ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య పథకం వంటి రెండు వాగ్దానాల అమలును రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందని సీఎం చెప్పారు.

భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగ ఖాళీల్లో 25,000 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేసి బహిరంగ కార్యక్రమాల్లో నియామక పత్రాలు అందజేసిందని తెలిపారు. "రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణమాఫీపై ప్రభుత్వం శుభవార్తతో ముందుకు వస్తుంది" అని ఆయన చెప్పారు.

Updated On 23 Feb 2024 9:42 PM GMT
Yagnik

Yagnik

Next Story