నేడు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ నిర్వహించనుంది. ఈ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిదిగా హాజరుకానున్నారు. ఈ సభలో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ విడుదల చేయనున్నామని టీపీసీసీ పేర్కొంది.

Priyanka Gandhi to address youth rally in Telangana today
నేడు హైదరాబాద్(hyderabad) సరూర్ నగర్ స్టేడియం(Saroor Nagar Stadium)లో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ(Congress Yuva Sangharshana Sabha) నిర్వహించనుంది. ఈ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ముఖ్య అతిదిగా హాజరుకానున్నారు. ఈ సభలో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్(Hyderabad Youth Declaration) విడుదల చేయనున్నామని టీపీసీసీ పేర్కొంది. మద్యాహ్నం 3.30 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎల్.బి నగర్(LB Nagar) లో శ్రీకాంత చారి(Srikantha Chary) విగ్రహానికి పూల దండలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడ నుంచి పాదయాత్ర తో సరూర్ నగర్ స్టేడియం వరకు వెళతారు. 4 గంటలకు ప్రియాంక గాంధీ బేగంపేట విమానాశ్రయాని(Begumpet Airport)కి ప్రత్యేక విమానంలో వచ్చి.. అక్కడ నుంచి హెలికాప్టర్ లో సరూర్ నగర్ స్టేడియం కు చేరుకుంటారు. రేవంత్ రెడ్డి నేరుగా హెలిప్యాడ్ వద్దకు చేరుకొని ప్రియాంక గాంధీకి స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రియాంక గాంధీ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రమాదాలల్లో మరణించిన 140 మంది భీమా పరిహారం అందజేస్తారు. తర్వాత బహిరంగ సభ యువ సంఘర్షణ సభలో ప్రసంగిస్తారని టీపీసీసీ(TPCC) ప్రకటనలో పేర్కొంది.
