చివరాఖరికి నకిలీ బెయిల్‌ కూడా వచ్చేసింది. అది కూడా చంచల్‌గూడ సెంట్రల్‌ జైలులో!

చివరాఖరికి నకిలీ బెయిల్‌ కూడా వచ్చేసింది. అది కూడా చంచల్‌గూడ సెంట్రల్‌ జైలులో! జైలు ఉన్నతాధికారులు బెయిల్ విభాగంలో ఓ విచారణ ఖైదీకి అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తే, అతడేమో నకిలీ బెయిల్‌ పేపర్లను పాస్‌ చేసి, మరో అండర్‌ ట్రయలర్‌ను విడుదల చేశాడు. విషయం తెలిసి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విషయానికి వస్తే హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌ హెచ్‌ఐజీ కాలనీకి చెందిన మీర్‌ సుజాత్‌ అలీఖాన్‌(Meer Sujath Ali khan) చీటింగ్‌ కేసులతో జైలుకు వెళ్లాడు. ఇంతకు ముందు కూడా జంతువుల హత్య, వాటికి విషం పెట్టడం వంటి నేరాలకు సంబంధించి అరెస్టయ్యాడు. ప్రస్తుతం సుజాత్‌ అలీ చంచల్‌గూడ జైలు(,ChanchalgudaJail)లో అండర్‌ ట్రయల్‌(యూటీ 5549)గా ఉన్నాడు. అక్టోబరు 17న ఆ కేసులో బెయిల్‌ రావడంతో విడుదలయ్యాడు. నవంబరు 2న నార్సింగ్‌ ఠాణాలో బీఎన్‌ఎస్‌లోని సెక్షన్లు 318, 144, 338, 336(3), 340(2) కింద కేసు నమోదైంది. పోలీసులు అతణ్ని అరెస్టు చేసి, చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌ చేశారు. అండర్‌ ట్రయలర్‌(UT 6687)గా ఉన్న సుజాత్‌ అలీ.. బెయిల్‌ విభాగంలో పనిచేసే రాము అనే మరో విచారణ ఖైదీ(UT 4831)ని మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాత.. పాత బెయిల్‌ పేపర్లను ఫోర్జరీ/ట్యాంపర్‌ చేసి ఇస్తే.. దాన్ని పాస్‌ చేయాలని.. అందుకు భారీ మొత్తంలో ప్రతిఫలం ఇస్తానంటూ రాముతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. డీల్‌ ఓకే అయ్యాక

ములాఖత్‌ సమయంలో తన వారిని కలిసిన సుజాత్‌ అలీ విషయాన్ని వివరించాడు. పాత బెయిల్‌ పేపర్లను ట్యాంపర్‌ చేయించాడు. కొత్త తారీఖులతో తాజా కేసులో బెయిల్‌ వచ్చినట్లుగా పేపర్లను సృష్టించాడు. ఆ నకిలీ బెయిల్‌ పత్రాలను రాముకు ఇచ్చాడు. రాము ఆ పత్రాలు కోర్టు నుంచి వచ్చినట్లుగా ధ్రువీకరిస్తూ.. స్టాంపింగ్‌ చేశాడు. ఉన్నతాధికారులు ఆ బెయిల్‌ పత్రాలు నిజమైనవేననుకున్నారు. నవంబరు 26వ తేదీన సుజాత్‌ అలీని విడుదల చేశారు. ఇక్కడితో కథ ముగియలేదు. మూడు రోజుల తర్వాత సుజాత్‌ అలీ చేసిన మోసమేమిటో తెలిసింది. అది కూడా మరో చీటింగ్‌ కేసులో దర్యాప్తు అధికారులు కోర్టు అనుమతితో సుజాత్‌ అలీని కస్టడీలోకి తీసుకోవడానికి పీటీ వారెంట్ దాఖలు చేశారు. దానికి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. నవంబర్‌ 29వ తేదీన పీటీ వారెంట్‌తో దర్యాప్తు అధికారులు చంచల్‌గూడ జైలుకు వెళ్లి సుజాత్‌ అలీని తమకు అప్పగించాలని కోరారు. దాంతో జైళ్ల శాఖ అధికారులు, సిబ్బంది షాకయ్యారు. ఎందుకంటే జైలులో ఉన్నవారికే పీటీ వారెంట్‌ వర్తిస్తుంది. అలాంటిది విడుదలైన సుజాత్‌ అలీకి పీటీ వారెంట్‌ రావడం ఏమిటని అనుకున్నారు. ఆరా తీశారు. అప్పుడు కానీ అతని బెయిల్‌ పత్రాలు నకిలీవని తేలియలేదు. దాంతో జరిగిన మోసాన్ని గుర్తించి, డబీర్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేతులు కాలిన తర్వాత ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్నారు. సుజాత్‌ అలీ కోసం వెతుకుతున్నారు.

నిజానికి బెయిల్‌ వ్యవహారాలను జైలు సూపరింటెండెంట్‌ పర్యవేక్షించాలి. ఆయన కూతురు పెళ్లి కారణంగా వారం రోజుల నుంచి సెలవుల్లో ఉన్నారు.సూపరింటెండెంట్‌ సెలవులో ఉంటే.. మరో జైలు సూపరింటెండెంట్‌ లేదా సీనియర్‌ డీఎస్పీకి బాధ్యతలను అప్పగించాలి. అది జరగలేదు. బిజీగా ఉండే డీఐజీ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. కీలకమైన బెయిల్‌ విభాగంలో దొంగతనం కేసులో అరెస్టయిన విచారణ ఖైదీ రాముకు బాధ్యతలను అప్పగించడం ఏమిటన్నది చాలా మంది సందేహం. జైళ్ల శాఖ నిబంధనల ప్రకారం.. విచారణ ఖైదీలకు ఎలాంటి బాధ్యతలను అప్పగించకూడదు. జైళ్ల కర్మాగారాల్లోనూ పనులు చేయించకూడదు. చంచల్‌గూడలో ఆ రూల్స్‌ ఎందుకు పాటించలేదన్నది పలు అనుమానాలకు తావిస్తోంది.

ehatv

ehatv

Next Story