ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటలో భాగంగా నిజామాబాద్ లో బీజేపీ నిర్వహించే సభలో పాల్గొననున్నారు.

Prime Minister Narendra Modi’s visit to Telangana today
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) నేడు తెలంగాణ(Telangana)లో పర్యటించనున్నారు. పర్యటలో భాగంగా నిజామాబాద్(Nizambad) లో బీజేపీ(BJP) నిర్వహించే సభలో పాల్గొననున్నారు. ఇందూరులో జరుగనున్న మీటింగ్‌కు బీజేపీ నేతలు జన గర్జన సభగా నామకరణం చేశారు. ఇక పర్యటనలో భాగంగా.. రూ.8021 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను శంకుస్థాపన చేసి వాటిని ఆయన జాతికి అంకితం చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇందూరు సభకు 2500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఐజీ(IG), డీఐజీ(DIG)తో పాటు 5గురు ఎస్పీలు, ఇద్దరు బెటాలియన్ కామాండెంట్లు, 13 మంది అదనపు ఎస్పీలు, 13 మంది ఏసీపీలు, 107మంది సీఐలు, 200 మంది ఎస్ఐలు 1900 మంది ఏఎస్ఐల నుంచి కానిస్టేబుల్లు ఇలా దాదాపు 2500 మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు.
