ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీరసావర్కర్ విగ్రహం వరకూ రెండు కిలో మీటర్ల మేర ప్రధాని మోదీ రోడ్డు షో సాగింది.

Prime Minister Modi’s election campaign has ended in Telangana
ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) తెలంగాణ ఎన్నికల ప్రచారం(Election Campaign) ముగిసింది. సోమవారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్(RTC Cross Road) నుంచి కాచిగూడ(Kachiguda) వీరసావర్కర్ విగ్రహం వరకూ రెండు కిలో మీటర్ల మేర ప్రధాని మోదీ రోడ్డు షో సాగింది. రోడ్డు షో లో ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మోదీపై అభిమానులు పూలవర్షం కురిపించారు. రోడ్డు షోలో మోదీ వెంట కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy), రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్(Lakshman) ఉన్నారు.
రోడ్డు షో కాచిగూడ చౌరస్తాకు చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ వీరసావర్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ప్రధాని రోడ్డు షో నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డు షో అనంతరం కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. రోడ్డు షోతో మోదీ ఎన్నికల ప్రచారం ముగియడంతో నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.
