ప్రధాని నరేంద్ర మోదీ జులై 12న తెలంగాణ పర్యటనకు రానున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. పర్యటనలో భాగంగా రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్‌ల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్) కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.

Prime Minister Modi will visit Telangana on July 12
ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) జులై 12న తెలంగాణ(Telangana) పర్యటనకు రానున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. పర్యటనలో భాగంగా రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేట(Kazipet)లో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్‌ల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (POH) కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్(BJP Mahajan Sampark Abhiyan)లో భాగంగా ప్రధాని జూన్(June) నెలాఖరులోపే రాష్ట్రానికి రావాల్సి ఉండగా.. కార్యక్రమం వాయిదా(Postpone) పడిందని నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే జులై(July) 12న రాష్ట్రానికి రానున్నారని పార్టీ ముఖ్య నేతల నుంచి సమాచారం. ప్రధాని పర్యటన నేపథ్యంలో వరంగల్‌లో భారీ బహిరంగ సభ(Public Meeting) నిర్వహణకు రాష్ట్ర నాయకత్వం సన్నాహాలు చేస్తున్నట్లు.. మరో రెండు రోజుల్లో ప్రధాని(Prime Minister) పర్యటన ఖరారు అవుతుందన్నారు.
