తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోరాటంలో ప్రొఫెసర్ కోదండరాం పోరాటాన్ని మరువలేరు. ఆయన తెలంగాణ వచ్చాక తెలంగాణా జన సమితి పార్టీ పెట్టి తన వంతు పోరాటం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా తన వాయిస్ ను వినిపిస్తూ ఉన్నారు.

President of Telangana Jana Samithi Professor Kodandaram made sensational comments
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు(Telangana Jana Samithi) ప్రొఫెసర్ కోదండరాం(Professor Kodandaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోరాటంలో ప్రొఫెసర్ కోదండరాం పోరాటాన్ని మరువలేరు. ఆయన తెలంగాణ వచ్చాక తెలంగాణా జన సమితి పార్టీ పెట్టి తన వంతు పోరాటం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్(CM KCR) కు వ్యతిరేకంగా తన వాయిస్ ను వినిపిస్తూ ఉన్నారు. ఆదివారం సూర్యాపేట(Suryapet)లో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా వున్నామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ(Telangana Movement) ఆకాంక్షలు నెరవేర్చడం లేదని తెలంగాణను వదిలి దేశ రాజకీయాల్లోకి వెళ్లడం సరికాదన్నారు. రాజకీయ స్వలాభం కోసమే కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం టీజేఎస్(TJS)తోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ శక్తులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటామని.. అవసరమైతే తమ పార్టీని విలీనం చేస్తామని కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల(Telangana People) కోసం ఎలాంటి నిర్ణయానికైనా తాము వెనుకాడబోమని అన్నారు.
