దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పెరేడ్‌కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(Dundigal Air Force Academy)లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్(Combined Graduate Parade)లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము((President Draupadi Murmu) పాల్గొన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పెరేడ్‌కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ధైర్యవంతులైన క్యాడెట్ల(Cadets)ను కన్న తల్లిదండ్రుల(Parents)కు నా శుభాకాంక్షలు.. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలు గుర్తుంచుకోవాలని సూచించారు. అధికారులుగా మీరు బాధ్యతలు తీసుకోబోతున్నారు. రాబోయే రోజుల్లో విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం నగరానికి వచ్చారు. ఈ సందర్బంగా బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం కేసీఆర్(CM KCR), గవర్నర్ తమిళిసై (Governor Tamilisai), కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.