మొన్నటికి మొన్న ఖమ్మం(Khammam) జిల్లా కొత్తగూడెం(Kothagudem) ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు(Vamana Venkateshwar Rao) ఎన్నిక చెల్లదంటూ ఆయనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత చాలా మంది ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అందుకు కారణం వారు కూడా ఇలాంటి కేసులను ఎదుర్కొంటున్నారు కాబట్టి. ! ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 30కి పైగా ఇలాంటి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో పాతిక మంది ఎమ్మెల్యేలు అధికార బీఆర్‌ఎస్‌(BRS) పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపడుతుందేమోనన్న టెన్షన్‌ వారిలో మొదలయ్యింది.

మొన్నటికి మొన్న ఖమ్మం(Khammam) జిల్లా కొత్తగూడెం(Kothagudem) ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు(Vamana Venkateshwar Rao) ఎన్నిక చెల్లదంటూ ఆయనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత చాలా మంది ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అందుకు కారణం వారు కూడా ఇలాంటి కేసులను ఎదుర్కొంటున్నారు కాబట్టి. ! ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 30కి పైగా ఇలాంటి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో పాతిక మంది ఎమ్మెల్యేలు అధికార బీఆర్‌ఎస్‌(BRS) పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపడుతుందేమోనన్న టెన్షన్‌ వారిలో మొదలయ్యింది.

ఆ పాతిక మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు(High Court) విచారణ చేపట్టడమే మిగిలి ఉంది. 2018లో ఎన్నికల సందర్భంగా ఈ పిటిషన్‌లన్నీ దాఖలయ్యాయి. శ్రీనివాస్‌ గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, చెన్నమనేని రమేశ్‌, మర్రి జనార్దన్‌రెడ్డి, ముత్తిరెడ్డిల భవిష్యత్తు ఈ నెలాఖరుకల్లా తేలబోతుందని అంటున్నారు. గద్వాల నియోజకవర్గంలో గెలిచిన కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదంటూ డీకే అరుణ పిటిషన్‌ వేశారు. అలాగే మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి సంబంధించి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక రద్దు చేయాలంటూ చంద్రశేఖర్‌ కోర్టును ఆశ్రయించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిపై కాట శ్రీనివాస్ గౌడ్‌ పిటిషన్ వేస్తే, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఎన్నికను సవాల్‌ చేస్తున్నారు కోవా లక్ష్మి.

ఖైరతాబాద్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అక్రమంగా గెలిచారంటూ దాసోజ్‌ శ్రవణ్‌ న్యాయస్థానం తలుపు తట్టారు. ఇక వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుపై పౌరసత్వం వివాదం ఎప్పట్నుంచో నలుగుతోంది. ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్‌ దీనిపై చాన్నాళ్ల నుంచి కోర్టులో పోరాడుతున్నారు. సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు ఎన్నికపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆయన చేతిలో ఓడిపోయిన కాసాని జ్ఞానేశ్వర్‌ కోర్టుకు వెళ్లారు. కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ ఈ ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్‌రెడ్డి న్యాయస్థానాన్ని వేడుకుంటున్నారు.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై మల్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావుపై ఆయన ప్రత్యర్థి దివాకర్‌రావు కోర్టులో పిటిషన్ వేశారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌ అక్రమంగా గెలిచారంటూ చాడ వెంకటరెడ్డి ఆరోపించడమే కాదు, కోర్టులో తేల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తుంగతుర్తిలో గ్యాదరి కిశోర్‌, అద్దంకి దయాకర్‌ మధ్య కూడా ఇలాంటి ఫైటే నడుస్తోంది. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డిపై పవన్‌ కుమార్‌ పిటిషన్‌ వేశారు. వరంగల్‌ ఈస్ట్‌లో నరేందర్‌ వర్సెస్‌ రవీందర్‌ పోరు కోర్టులో సాగుతోంది. ఆలేరు నియోజకవర్గం నుంచి గెలిచిన గొంగడి సునీతపై సతీష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్‌ ఎన్నికపై విష్ణువర్ధన్‌రెడ్డి కోర్టుకు వెళ్లారు.

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై అనర్హత వేటు వేయాలంటూ రామచందర్‌రావు కోర్టుకు విజ్ఞప్తి చేస్తూ పిటిషన్‌ వేశారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు కూడా ఈ కష్టాలు తప్పడం లేదు. అప్పుడు గంగుల చేతిలో ఓటమి చెందిన బండి సంజయ్‌ కోర్టులో పిటిషన్ వేశారు. ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌పై అడ్లూరి లక్ష్మణ్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య అక్రమంగా గెలిచారంటూ ప్రత్యర్థి ఉత్తమ్‌ పద్మావతి హైకోర్టు తలుపు తట్టారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిపై ఇదే విషయంపై నాగం జనార్దన్‌రెడ్డి కోర్టుకు వెళ్లారు.

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అనర్హుడిగా ప్రకటించాలంటూ ప్రేమ్‌సింగ్ రాథోడ్‌ న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. వికారాబాద్‌లో మెతుకు ఆనంద్‌, గడ్డం ప్రసాద్‌ మధ్య కోర్టులో పోరు సాగుతోంది. పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిపై రామ్మోహన్‌రెడ్డి పిటిషన్‌ వేశారు. జనగాంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఉన్న తలనొప్పులతో పాటు కొత్తగా కోర్టు టెన్షన్‌ మొదలయ్యింది. పొన్నాల లక్ష్మయ్య ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌పై ఫిరోజ్‌ ఖాన్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ల విచారణకు సంబంధించి రిటైర్డ్‌ జడ్జ్‌ శైలజతో ఓ కమిషన్‌ను నియమించింది హైకోర్టు. ఆగస్టు 12 నుంచి 17 వరకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాబోయే రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేల ఎలక్షన్‌ పిటిషన్లు విచారణకు రానున్నాయి.

Updated On 2 Aug 2023 2:48 AM GMT
Ehatv

Ehatv

Next Story