తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల జాబితా, పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా వచ్చే నాలుగైదు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసేందుకు సిద్ధం కావాలని కలెక్టర్లను కమిషనర్ ఆదేశించారు. కాగా, గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొదట సర్పంచ్, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.

ఎన్నికల సంఘం.. ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 6న, తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 21న ప్రకటించనుంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 600 నుంచి 650 ఓటర్లు దాటితే అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు ప్రారంభమ‌వ‌డంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు ప్రారంభించగా.. బీఆర్ఎస్, బీజేపీ తమ సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story