మంచిర్యాలలో(mancherial) తీవ్ర విషాదం నెలకొంది. తొమ్మిది నెలలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్‌ భార్య రవళిక (26) సోమవారం ఉదయం నందిని ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆస్పత్రి వైద్యురాలు సాధారణ డెలివరీ చేయడంతో బాబుకు జన్మనిచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

మంచిర్యాలలో(mancherial) తీవ్ర విషాదం నెలకొంది. తొమ్మిది నెలలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్‌ భార్య రవళిక (26) సోమవారం ఉదయం నందిని ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆస్పత్రి వైద్యురాలు సాధారణ డెలివరీ చేయడంతో బాబుకు జన్మనిచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రవళికకు అధిక రక్తస్రావం(Bleeding) కావడంతో వైద్యురాలు వెంటనే రక్తం కావాలని కుటుంబ సభ్యులకు తెలిపింది. భర్త వెంకటేష్‌ బ్లండ్‌ బ్యాంక్‌ నుంచి బ్లడ్‌ తీసుకొని వచ్చేలోపే బాధితురాలును మెడిలైఫ్‌ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులకు చెప్పకుండానే మహిళను మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే మెడిలైఫ్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రవళిక మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలు నందిని, మెడిలైఫ్‌ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే రవళిక మృతి చెందిందని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న సీఐ బన్సీలాల్‌ సిబ్బందితో కలిసి ఆసుపత్రి వద్దకు చేరుకుని రవళిక కుటుంబసభ్యులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు

Updated On 7 May 2024 4:25 AM GMT
Ehatv

Ehatv

Next Story