తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని(Prajavani Program) అట్టహాసంగా మొదలు పెట్టారు. ప్రతి రోజూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మొదటి రోజు వచ్చారంతే. తర్వాత ఎప్పుడూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని(Prajavani Program) అట్టహాసంగా మొదలు పెట్టారు. ప్రతి రోజూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మొదటి రోజు వచ్చారంతే. తర్వాత ఎప్పుడూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. అదే విధంగా రోజూ నిర్వహిస్తామని చెప్పిన ఈ కార్యక్రమాన్ని తర్వాత వారంలో రెండు రోజులకు పరిమితం చేశారు. లోక్‌సభ ఎన్నికల కోడ్(Lok Sabha Election Code) కారణంగా ప్రజావాణి కార్యక్రమానికి బ్రేక్ పడింది. గురువారంతో ఎన్నికల కోడ్ ముగియడంతో ఇవాళ్టి నుంచి ప్రజావాణి మొదలయ్యింది. ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరిస్తున్నారు. ఇంతకు ముందులాగే మంగళ, శుక్రవారాలలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి(G. Chinna Reddy) తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు.