29న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు మేడి గడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు అధికారులు షెడ్యూల్ విడుద‌ల చేశారు.

29న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), శ్రీధర్ బాబు(Sridhar Babu)లు మేడి గడ్డ ప్రాజెక్టు(Medigadda Project) సందర్శనకు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు అధికారులు షెడ్యూల్ విడుద‌ల చేశారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్(Hyderabad) నుంచి హెలికాప్టర్(Helicopter) లో మంత్రులు మేడిగడ్డకు బయలుదేరుతారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారు. ప్రాణహిత ప్రాజెక్టు(Pranahitha Project), కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలు వివ‌రిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం.. కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు, ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్ వివరాలను వెల్ల‌డిస్తారు.

మేడిగడ్డ, సిందిళ్ళ(Sundilla), అన్నారం బ్యారేజ్(Annaram Barrage) ల సమస్యలు, వాటి పరిష్కారాలు..తదితర అంశాలపై సమీక్ష(Review) నిర్వ‌హిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్(Poer Point Presentation) అనంతరం మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ లను సందర్శించి పరిశీలన చేయడం జరుగుతుంద‌ని తెలిపారు. ఈ పర్యటన కు సంబంధించి నిర్మాణ సంస్థలకు సబ్ కాంట్రాక్టర్లలకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి అందరికి సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోగలరని ఈఎన్‌సీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశింశారు. ఈ సమీక్షను పర్యటనను కవర్ చేయడానికి మీడియాకు అవసరమైన ఏర్పాట్లు చేయాల‌ని.. సమాచార శాఖకు తగిన సమాచారం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.

Updated On 24 Dec 2023 10:51 PM GMT
Yagnik

Yagnik

Next Story