ప్ర‌ధాని మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ మరోసారి హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలో మోదీ పర్యటించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే మోదీకి మహబూబ్ నగర్ లో, తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు.

ప్ర‌ధాని మోదీ(PM Modi) రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ మరోసారి హైదరాబాద్(Hyderabad) లో పోస్టర్లు(Posters) వెలిశాయి. ఆదివారం మహబూబ్ నగర్(Mahabub Nagar) జిల్లాలో మోదీ పర్యటించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే మోదీకి మహబూబ్ నగర్ లో, తెలంగాణ(Telangana)లో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పోలవరం ప్రాజెక్టు(Polavaram Project), కర్నాటక(Karnataka)లో అప్పర్ భద్ర(Upper Bhadra) ప్రాజెక్టులకు జాతీయ హోదా(National Status) ఇచ్చారు. తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టు(Palamoor Project)కు ఇవ్వలేదంటూ ఫ్లెక్సీలు వివ‌రించారు. తెలంగాణ మీద మోదీది సవతితల్లి ప్రేమ అంటూ విమర్శించారు. శంషాబాద్(Shamshabad) విమానాశ్రయంలో కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వినూత్నంగా స్వాగత పోస్టర్లు ఏర్పాటు చేశారు. What happened modi అంటూ ఎయిర్ పోర్ట్(Airport) పరిసరా ప్రాంతాల్లో పోస్టర్లు ద్వారా ప్ర‌శ్నించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఏది.? పసుపు బోర్డు ఎక్కడ.? మీ హామీలు అన్ని నీటి ముట‌లేనా అంటూ ప్లెక్సీలలో ప్ర‌శ్నించారు. రావణాసురుడు తలతో మోదీ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఐటిఐఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,టెక్ష్ట్స్ టైల్ పార్క్, డిఫెన్స్ కారిడార్, మిషన్ భగీరథ నిధులు, గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డ్ ఎక్కడ అంటూ రావణాసురుడు తలతో మోదీ బ్యానర్ ఏర్పాటు చేశారు. పోస్ట‌ర్ల‌పై బీజేపీ శ్రేణులు స్పందించాల్సివుంది.

Updated On 30 Sep 2023 10:44 PM GMT
Yagnik

Yagnik

Next Story