హైదరాబాద్ మహానగరంలో కేఫ్ బహార్‌కు ప్రత్యేక స్థానం ఉంది.
హైదరాబాద్ మహానగరంలో కేఫ్ బహార్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి కేఫ్ బహార్ రెస్టారెంట్ గత పది రోజులుగా తెరచుకోకపోవడం బాధిస్తోంది. వేలాది మంది కష్టమర్లతో కళకళలాడిన ఆ కేఫ్ తాత్కాలికంగా మూతబడింది. కుటుంబసభ్యుల మధ్య ఏర్పడిన ఆస్తి గొడవలే కారణమని తెలుస్తోంది. దీంతో రోజూ విపరీతమైన రద్దీ ఉంటే హైదర్‌గూడ కేఫ్ బహార్ పరిసరాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. 1973లో ఇరానియన్ హుస్సేన్ బోలూకి హైదర్‌గూడలో చిన్న టీస్టాల్‌ను ప్రారంభించారు. తర్వాతర్వాత ఇది మల్టీక్యూజియన్ రెస్టారెంట్ లెవల్‌కు చేరుకుంది. ఈ కేఫ్‌లో 250 మందికి పైగా పని చేసేవారు. కోవిడ్ సమయంలో హుస్సేన్ బోలూకి చనిపోయారు. ఆయన మరణించిన తర్వాత కుటుంబసభ్యులు ఆస్తుల కోసం కొట్టుకోవడం మొదలయ్యింది. ఈ గొడవల కారణంగానే కేఫ్‌ను మూసేశారు. కొద్ది రోజులలో రెస్టారెంట్‌ను మళ్లీ తెరుస్తారనే నమ్మకంతో ఉన్నారు చుట్టుపక్కల ఉన్న దుకాణాల యజమానులు.