రైతుల కోసం కేసీఆర్ మరో రెండు అడుగులు ముందు వేశారని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

రైతుల కోసం కేసీఆర్ మరో రెండు అడుగులు ముందు వేశారని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కు గోదావరి జలాలపై అవగాహన లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాధ్యత లేకుండా పారిపోయింది ఎవరో తెలియదా? మంత్రుల మాటల్లో అవేశం, అవగాహన లోపం, అనుభవ రాహిత్యం మాత్రమే ఉన్నాయన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాకు, సొంత ఊరికి వచ్చే ప్రాజెక్టు గురించి ఏనాడైనా మాట్లాడారా.? అని ప్ర‌శ్నించారు. సీఎం బిజీగా ఉన్నట్లున్నారు.. రాత్రి క్రికెట్ మ్యాచ్ కు వెళ్లారని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ ఆనకట్ట వద్ద సమస్య ఉంటే.. అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి ఎందుకు ఎత్తిపోయలేదు?సమాధానం చెప్పాలన్నారు. అన్నారం, సుందిళ్ల లోని నాలుగు టీఎంసీలు ఎత్తిపోయకుండా కిందకు ఎందుకు కిందకు వదిలారు? అని ప‌శ్నించారు. తప్పుడు సమాచారంతో నీచ రాజకీయాలకు పాల్పడిన వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తుపాకుల గూడెం ద్వారా డిసెంబర్ 7 నుంచి మార్చ్ 7 వరకు 48 టీఎంసీలు దిగువకు వదిలారు.. దేవాదుల మోటార్లు నడిపి నీటిని ఎందుకు ఎత్తిపోయలేదు? అని ప్ర‌శ్నించారు.

మేడిగడ్డపై నివేదిక రాలేదు, మరమ్మత్తులు చేయలేదన్నారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని ఉన్న నీటిని వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారు నష్టాన్ని పూడుస్తున్నారట.. ఇంతటి నీటి ఇబ్బందులు ఉంటే కేఆర్ఎంబీ సమావేశానికి ఇంజనీర్లు ఎందుకు వెళ్ళలేదు ? కృష్ణా బోర్డును నీరు అడగలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నీరు ఎందుకు అడగడం లేదు? ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ లో ప్రభుత్వాలు మారాయి ..బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి.. అక్కడ‌ కాంగ్రెస్ అవినీతిని పాతర పెట్టారని మంత్రులు ఒప్పుకున్నట్లేనా? ఉన్న పార్టీని తప్పు పట్టే నీచ సంస్కృతి, అటువంటి వాళ్లను కాంగ్రెస్ పార్టీ ఎలా భరిస్తుందో.? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. కాంగ్రెస్ నాయకత్వం ఇటువంటి వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని అన్నారు.

కేసీఆర్ అప్పుల పాలు చేశారని మంత్రులు మాట్లాడడానికి సిగ్గు ఉండాలన్నారు. కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే పారిపోయిన నేతలు ప్రాజెక్టులు, అప్పులు, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కాగానే శంఖు స్థాపన చేసిన కొడంగల్ - నారాయణపేట ఎత్తిపోతల పూర్తయ్యే నాటికి ఎంత సమయం అవుతుందో చూద్దామ‌న్నారు. జూరాల నుంచి ఏడు టీఎంసీలను దొచుకొచ్చి కొడంగల్ - నారాయణపేట ద్వారా కొన్ని ఎకరాలకు సాగునీరు ఇస్తారట.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుచూపుతో మూడు ఆనకట్టలను కేసీఆర్ నిర్మించారు.. ఒట్టి మాటలు కట్టిపెట్టాలన్నారు. ఖర్చు గురించి అన్నాను.. కానీ కాళేశ్వరం ప్రాజెక్టును నేను ఏ రోజూ తప్పు పట్టలేదన్నారు. ప్రజలను భ్రమల్లో పెట్టాలని 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని అంటున్నారు. నీళ్లకు, ఎమ్మెల్యేల చేరికకు ఏం సంబంధం? అని ప్ర‌శ్నించారు.

Updated On 6 April 2024 5:23 AM GMT
Yagnik

Yagnik

Next Story