కాంగ్రెస్‌(Congress)కు మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నాయంటూ సంచ‌ల‌న లేఖ విడుద‌ల చేసిన ఆయ‌న పార్టీని వీడుతున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న రాజీనామా లేఖ‌ను పార్టీ అధిష్టానానికి పంపారు. పొన్నాల బీఆర్ఎస్‌లో చేర‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడిగా కూడా ప‌నిచేశారు. పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లాలోని జనగాం నియోజకవర్గం నుండి నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. 12 ఏళ్లు వివిధ శాఖ‌ల‌లో మంత్రిగా ప‌నిచేశారు. పొన్నాల పార్టీని వీడ‌టంతో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీగానే న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉంది.

Updated On 13 Oct 2023 4:40 AM GMT
Ehatv

Ehatv

Next Story