ఖమ్మం జిల్లా(Khammam District) అసెంబ్లీ సీట్ల(Assembly Seats)లో ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA's)లను ఒక్కరినీ కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కనీయనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasreddy) అన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. 2014, 2018 లో వచ్చిన ఒక్క సీటు కూడా మీకు దక్కనీయనన్నారు. ఒక్క ఖమ్మం జిల్లానే కాదు, నాలా నష్టపోయిన వందలాది మంది నేతలలో రాజకీయ నిర్ణయం తీసుకుంటాన‌ని పేర్కొన్నారు. పార్టీలో ఎవరికీ గౌరవం లేదని.. కొద్ది రోజులలో అందరూ బయటకు వస్తారని అన్నారు.

ఖమ్మం జిల్లా(Khammam District) అసెంబ్లీ సీట్ల(Assembly Seats)లో ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA's)లను ఒక్కరినీ కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కనీయనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasreddy) అన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. 2014, 2018 లో వచ్చిన ఒక్క సీటు కూడా మీకు దక్కనీయనన్నారు. ఒక్క ఖమ్మం జిల్లానే కాదు, నాలా నష్టపోయిన వందలాది మంది నేతలలో రాజకీయ నిర్ణయం తీసుకుంటాన‌ని పేర్కొన్నారు. పార్టీలో ఎవరికీ గౌరవం లేదని.. కొద్ది రోజులలో అందరూ బయటకు వస్తారని అన్నారు. గత వంద రోజులుగా గుర్తుకు రాని సస్పెన్షన్(Suspension0), జూపల్లి(Jupally) ఖమ్మం రాకతో ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్ర‌శ్నించారు. నన్ను రాజకీయ సమాధి చేయాలని చూసింది నిజం కాదా కేసీఆర్(KCR)..? అని ప్ర‌శ్నించారు. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) తరువాత ఇస్తానన్న రాజ్యసభ టిక్కెట్ ఏమైందని అడిగారు.

నా కొడుకు రిసెప్షన్ కు వచ్చిన ప్రజలను చూసి కళ్ళు కుట్టాయా అని ప్ర‌శ్నించారు. నన్ను నమ్ముకున్న వేలాది మందిని ఇబ్బంది పెట్టి, ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా ఇప్పటి వరకు మిమ్మల్ని నమ్మే ఉన్నాను. నేను నమ్మిన సిద్ధాంతం కోసం, నన్ను ఆశీర్వదించే ప్రజలకోసం ఎంతవరకైనా పోరాడుతాన‌ని స్ప‌ష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కూడా కార్యకర్తలకు అండగా ఉన్నా.. ప్రతి ఒక్కరికీ ఆర్ధిక సహాయం చేశా.. చివరకు జిల్లా అధ్యక్షుడు తాతా మధు సొంత ఊరికి కూడా వెన్నుదన్నుగా నిలిచాన‌ని పేర్కొన్నారు.

ఎంపీటీసీ(MPTC), జడ్పీటీసీ(ZPTC) ఎన్నికలలో నా వారికి భీ ఫామ్ లు ఇవ్వకుండా.. రాజకీయంగా నన్ను ఇబ్బందులకు గురి చేశార‌ని.. కానీ ప్రజలలో ఉన్న నన్ను ఏమి చేయలేరని అన్నారు. ఖమ్మం మున్సిపాలిటీలో నా వారికి 5, 6 సీట్లు ఇవ్వ‌మ‌న్నా ఇవ్వలేదని వాపోయారు. 2014 ముందు రాజకీయ చరిత్ర లేదు, అయినా ప్రజల కష్ట‌ సుఖాలలో ప్రజలకు తోడుగా ఉన్నా, ఇది కూడా తప్పనే అంటారా..? అని ప్ర‌శ్నించారు.

సింగరేణి ఎన్నికల(Singareni Elections)లో 32 రోజులు కొత్తగూడెంలో ఉండి పని చేశా.. మీరిచ్చిన గౌరవం ఏమిటి అని ప్ర‌శ్నించారు. తండ్రిలా భావించిన.. ప్లీనరీకి 2 కోట్లు రూపాయలు ఇచ్చిన.. దక్కిన గౌరవం ఏమిటి.. మీ మాటలు మేడి పండ్లు అయ్యాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో యోధానుయోధులను ఎలా అగౌరపరిచారో.. ఇప్పుడు నాకు అదే జరిగిందని అన్నారు. అందుకే నా ప్రజలకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఒక్కరో ఇద్దరో వారి పదవుల కోసం నా పై మాట్లాడటం తప్ప.. నా మాటలు తప్పుకావ‌ని అన్నారు.

ప్రజలలోకి వెళ్తాను, ప్రజాలలోనే ఉంటానని స్ప‌ష్టం చేశారు. భగవంతుడు తప్పు చేసిన వారి అందరినీ శిక్షిస్తాడని అన్నారు. ఒకే కుటుంబమనే మీరు ఇప్పటి వరకు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదని ప్ర‌శ్నించారు. కోర్టులు శిక్షలు విధించినా.. కోర్కెలేమిటని ముద్దాయిలను అడుగుతాయి.. పార్టీల నుండి బయటకు పంపేటప్పుడు కనీసం విజ్ఞత లేదని.. ఇప్పుడు మిమ్మల్ని తప్పు పడుతున్నానన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికి వరదలా వెళ్లాయి.. కేసీఆర్ కుటుంబమే బంగారు కుటుంబం అయ్యిందని విమ‌ర్శ‌లు గుప్పించారు.

Updated On 10 April 2023 4:49 AM GMT
Ehatv

Ehatv

Next Story