తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారా? కమలదళం అధినాయకులు పొంగులేటిని పిలిపించుకుని దువ్వుతున్నారా? ఆయన బీజేపీలో చేరడం ఖాయమయ్యిందా? తెలంగాణ రాజ్య సమితి పార్టీ అటకెక్కినట్టేనా? పొద్దున్నుంచి రాజకీయాలపైన కాసింత ఆసక్తి ఉన్నవారిని పట్టి పీడిస్తున్న సందేహాలివి! అయితే ఆయన ఢిల్లీకి వెళ్లలేదని, అరుణాచలం పుణ్యక్షేత్ర సందర్శనానికి వెళ్లారని మాకు అందిన విశ్వసనీయ సమాచారం. ఢిల్లీ పెద్దల పిలుపు మేరకు బీజేపీలో చేరేందుకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య […]
తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారా? కమలదళం అధినాయకులు పొంగులేటిని పిలిపించుకుని దువ్వుతున్నారా? ఆయన బీజేపీలో చేరడం ఖాయమయ్యిందా? తెలంగాణ రాజ్య సమితి పార్టీ అటకెక్కినట్టేనా? పొద్దున్నుంచి రాజకీయాలపైన కాసింత ఆసక్తి ఉన్నవారిని పట్టి పీడిస్తున్న సందేహాలివి! అయితే ఆయన ఢిల్లీకి వెళ్లలేదని, అరుణాచలం పుణ్యక్షేత్ర సందర్శనానికి వెళ్లారని మాకు అందిన విశ్వసనీయ సమాచారం.
ఢిల్లీ పెద్దల పిలుపు మేరకు బీజేపీలో చేరేందుకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య నాయకులు, అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్లారన్న వార్తలకు తెరపడింది. ముఖ్యనేతలు, అనుచరులతో కలిసి పొంగులేటి అరుణాచలంలో దైవ దర్శనం చేసుకున్నారు. తాము ఢిల్లీ వెళ్లినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని సన్నిహితులలో ఒకరు చెప్పారు. పొంగులేటి వెంట మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జెడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్యతో పాటు పలువురు నేతలు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పొంగులేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతోంది. బీఆర్ఎస్ నుంచి దాదాపు బయటకు వచ్చిన పొంగులేటి కొత్త పార్టీ పెడుతున్నారా లేదా బీజేపీలో చేరుతున్నారా అనే దానిపై కొంత కాలంగా రాజకీయా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. తెలంగాణ రాజ్య సమితి పేరుతో పార్టీ పెడుతున్నారనే వార్తల నేపథ్యంలోనే కేంద్రంలోని పెద్దలు పొంగులేటిని ఢిల్లీకి పిలిచారని ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో పొంగులేటిసహా ముఖ్య నాయకులు, అనుచరులు రాష్ట్రంలో లేరనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. అయితే తన రాజకీయ అడుగు ఏటువైపు అనే దానిపై ఉగాది పండుగ తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం ఉమ్మడిజిల్లాపై పూర్తి ఫోకస్ పెట్టిన పొంగులేటి..తన మద్దతు దారులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల వైఎస్సార్టీపీలో చేరుతున్నారనే ప్రచారమూ జరిగింది. కానీ, పొంగులేటి మాత్రం తాను ఏ పార్టీలో చేరే అంశంపై మాట్లాడటం లేదు. ముందుగా అన్ని నియోజకవర్గాల్లో తన ప్రభావం ఎంత వరకు ఉంది, తనతో కలిసి వచ్చేదెవరనే అంశాలపై పైన క్లారిటీ తీసుకుంటున్నారు. తాజాగా పాలేరులో పొంగులేటి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పైన ఆరోపణలు గుప్పించారు. ధనిక రాష్ట్రమని చెప్పుకొనే తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలైందని తీవ్ర విమర్శలు చేసారు. రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయనుకుంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిందన్నారు.ప్రజలను ప్రభుత్వంలోని పెద్దలు మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ విషయంలో ప్రజలు రెండు సార్లు మోసపోయారని..మూడోసారి ఎవరు మోసపోతారో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయం వస్తోందని..ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పొంగులేటి పిలుపునిచ్చారు.