తుక్కుగూడ రాజీవ్ గాంధీ సభా ప్రాంగణం నుంచి తెలంగాణ జనజాతర సభా నిర్వహిస్తున్నామ‌ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోనియాగాంధీ.. రాహుల్ గాంధీ.. ఖర్గే .. ప్రియాంక గాంధీ అందరూ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తారని తెలియ‌జేశారు.

తుక్కుగూడ రాజీవ్ గాంధీ సభా ప్రాంగణం నుంచి తెలంగాణ జనజాతర సభా నిర్వహిస్తున్నామ‌ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోనియాగాంధీ.. రాహుల్ గాంధీ.. ఖర్గే .. ప్రియాంక గాంధీ అందరూ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తారని తెలియ‌జేశారు. జూన్ 6న రాహుల్ ప్రధానమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారని అనడానికి ఈ సభ సాక్షంగా నిలవాలన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీ లతో పాటు ఇవ్వని ఎన్నో హామీలు తెలంగాణలో తీరుస్తున్నామ‌న్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం భద్రాచలంలో ప్రారంభం చేశామ‌ని తెలిపారు. రాష్ట్ర పరిస్థితిపై శ్వేత పత్రం ద్వారా తెలియజేసిన‌మ‌న్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో లక్ష కోట్లు అవినీతి చేశార‌ని.. CMRF లో కూడా అవినీతి చేశార‌ని బీఆర్ఎస్ నేత‌ల‌పై మండిప‌డ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశార‌ని.. కాంగ్రెస్ వచ్చింది.. కరువు వచ్చింది అంటున్నారు.. వర్షాలు పడనిది మీ హయంలోనేన‌ని చెప్పుకొచ్చారు.

ఈ సారి 56% వర్షపాతం తక్కువ గా నమోదు ఐయ్యింద‌ని వివ‌రించారు. తక్కువ వర్ష పాతం నమోదు అయిందని మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికార పత్రికనే వార్తలు రాసిందని గుర్తుచేశారు. తెలంగాణలో 16% రిజర్వాయర్ లలో నీళ్లు అడగంటుతున్నాయి. మీరు అధికారంలో ఉన్నపుడే అధికారులు తాగు, సాగు నీటి కరువు రాబోతుంది అని నివేదికలు ఇచ్చారని గుర్తుచేశారు. 45 వేల కోట్లు ఖర్చుచేసి కట్టిన మిషన్ భగీరథ‌ ఇప్పుడు ఎందుకు గ్రామాలకు నీళ్లు ఇవ్వలేకపోతుందన్నారు. కాళేశ్వరం లోపం వల్లే గోదావరి నీళ్లు కిందకు వదలవలసి వచ్చిందన్నారు. మీ పదేళ్ల పాలనలో ఎండిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వని మీరు.. ఇప్పుడు ఎందుకు రైతులపై ప్రేమ చూపుతున్నారని ఫైర్ అయ్యారు. ఫోన్ టాపింగ్ అంశం సీఎం పరిశీలిస్తున్నారు.. నా ఫోన్ తో పాటు నా సిబ్బంది, చివరకు డ్రైవర్ ఫోన్ లు కూడా టాపింగ్ చేసారు. దానివల్ల BRS వాళ్లు రాజకీయ లబ్ధి పొందారని అన్నారు. కేటీఆర్ ఎవరి తాటా ఎవరు తీస్తారో ముందు ముందు తెలుస్తుందన్నారు. మాదాక అవసరం లేదు ప్రజలే మీ తాటతీస్తారని అన్నారు. మాట మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితువు ప‌లికారు.

Updated On 3 April 2024 9:52 PM GMT
Yagnik

Yagnik

Next Story