తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేశారు.. రెండు సార్లు సీఎం అయినా ఆయన తెలంగాణకు ఏం చేశాడని పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.

Ponguleti Srinivas Reddy Fire On CM KCR
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో రెండు సార్లు కేసీఆర్(KCR)ను ముఖ్యమంత్రిని చేశారు.. రెండు సార్లు సీఎం అయినా ఆయన తెలంగాణకు ఏం చేశాడని పాలేరు(Paleru) కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) ప్రశ్నించారు. గురువారం తిరుమలాయపాలెంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ దోచుకోడానికేనా అన్నట్లుగా ఆయన నడవడిక ఉందన్నారు. ఈనాటి పరిస్థితి చూస్తుంటే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మనందరం కేసీఆర్‌కు తాకట్టు పెట్టినట్లు ఉందన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదలకు ఇళ్ళు, రేషన్ కార్డులు ఏవీ ఇవ్వలేదని విమర్శించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao)ను ప్రజలు ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ తొమ్మిదవ తారీఖున కాంగ్రెస్(Congress) నాయకుడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని జోస్యం చెప్పారు. భూమి లేని పేదలకు సంవత్సరానికి 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామన్నారు. మంచి కార్యక్రమాలు కావాలి అంటే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
