మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(ponguleti srinivas reddy) రాజకీయ అడుగులు ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్(BRS) నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి దారెటు అనే దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. కాంగ్రెస్(congress), బీజేపీ(BJP) నుంచి ఇద్దరు పొంగులేటికి పోటాపోటీగా ఆహ్వానాలు అందుతున్నాయి.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(ponguleti srinivas reddy) రాజకీయ అడుగులు ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్(BRS) నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి దారెటు అనే దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. కాంగ్రెస్(congress), బీజేపీ(BJP) నుంచి ఇద్దరు పొంగులేటికి పోటాపోటీగా ఆహ్వానాలు అందుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ..ఉమ్మడి ఖమ్మంజిల్లాపై(khammam) దృష్టి సారించింది. ఇప్పటి వరకు ఏ మాత్రం పట్టులేని జిల్లాపై ప్రధానంగా గురిపెట్టిన కమలదళం..బీజేపీ వ్యతిరేక శక్తులను తమవైపు తిప్పుకునేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ బహిస్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తమవైపు తిప్పుకునేలా కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు మరింత పదును పెట్టింది. గురువారం ఉదయం ఈటల రాజేందర్(Rajendhranath) నేతృత్వంలోని బీజేపీ ప్రచార కమిటీ ఖమ్మంలోని పొంగులేటి నివాసానికి చేరుకొని సుధీర్ఘంగా చర్చలు జరిపింది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఏదో ఒక జాతీయ పార్టీలో పొంగులేటి చేరుతారని స్పష్టమైనప్పటికీ.. ఏ పార్టీలోకి వెళ్తారనేది ఆయన అభిమానులతో పాటు, రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర విషయంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే తన వర్గీయులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. సీఎం కేసీఆర్ లక్ష్యంగా పొంగులేటి విమర్శలు చేస్తూ వచ్చారు. గతనెల మొదటి వారంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కొత్తగూడెంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఏప్రిల్ 10న వారిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి కాంగ్రెస్, బీజేపీ.. ఏ పార్టీలో చేరుతారనేది అప్పటి నుంచి ప్రశ్నగానే మిగిలిపోయింది.ఇరు పార్టీలు పొంగులేటికి ఆహ్వానాలు పంపుతున్నాయి. సందర్బం వచ్చినప్పుడల్లా పొంగులేటితో చర్చలు జరుపుతున్నాయి. ఇటు బీజేపీ(BJP) అటు కాంగ్రెస్ పార్టీ నేతలు పొంగులేటితో టచ్ లో ఉంటున్నారు. గత నెలలో అమిత్ షా పర్యటన సమయంలో పొంగులేటి బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఇప్పటికే రాహుల్ గాంధీ టీం పొంగులేటితో మంతనాలు జరిపింది. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పెద్దపీట వేస్తామని పొంగులేటికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. తన అనుచరులందరికీ టికెట్లు ఇస్తే కాంగ్రెస్‌లోకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తానని పొంగులేటి వారికి హామీ ఇచ్చినట్టు తెలిసింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర, పోదెం వీరయ్య ఎమ్మెల్యేగా ఉన్న భద్రాచలం మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిగతా సీట్లన్నీ పొంగులేటి అనుచరులకు ఇచ్చేందుకు దాదాపు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పొంగులేటి కాంగ్రెస్‌లోకి చేరుతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ అవి కూడా కార్యరూపం దాల్చలేదు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి పెద్దగా పట్టులేదు. ఆ జిల్లాలో బీజేపీ బలపడాలంటే పొంగులేటి లాంటి నాయకులు అవసరమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా పొంగులేటితో చర్చలు జరిపిన బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్..అధిష్టానం ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం ఖమ్మంలోని పొంగులేటి నివాసానికి చేరుకొని మరోసారి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ప్రచార కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందన్ రావు, మరికొందరు బీజేపీ నేతలు పాల్గొన్నారు. పొంగులేటిని పార్టీలో చేరాలని కోరడంతోపాటు, చేరితే ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుందనే విషయంపై క్లారిటీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా కాంగ్రెస్ మాదిరిగానే ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశం తర్వాత పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారనేది స్పష్టత వస్తుందని, దాదాపు బీజేపీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
మరోవైపు తెలంగాణ బీజేపీలో నేతల మధ్య ఉన్న అంతర్గత లుకలుకలు బయటపడ్డాయి. బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదన్న వాదనలకు బలం చేకూరుస్తూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల నేతృత్వంలోని బీజేపీ ప్రచారం కమిటీ ఖమ్మం వెళ్తున్న సంగతి తనకు తెలియదంటూ మీడియాతో చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తనకు తలియదంటూనే చెప్పకపోవడం పెద్ద తప్పేమీ కాదన్నారు. తనకు తెలిసిన వారితో తాను.. ఈటలకు తెలిసిన వారితో ఆయన మాట్లాడుతున్నారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. దీని ద్వారా ప్రచారం సాగుతున్నట్లుగా బీజేపీ ముఖ్య నేతల మధ్య ఐక్యత లేదనేది మరోసారి రుజువైంది. బండి సంజయ్ తనకు సమాచారం లేదని చెప్పటం పైన ఇప్పుడు ఈట రాజేందర్ ఏ రకంగా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.