రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) నిలిచారు. ఆయన తన కుటుంబానికి కోట్లకుపైగా స్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‎లో(Election Affidavit) వెల్లడించారు. రెండో స్థానంలో మరో బీఆర్ఎస్(BRS) అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి(Pailla Shekhar Reddy) నిలిచారు.

రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) నిలిచారు. ఆయన తన కుటుంబానికి కోట్లకుపైగా స్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‎లో(Election Affidavit) వెల్లడించారు. రెండో స్థానంలో మరో బీఆర్ఎస్(BRS) అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి(Pailla Shekhar Reddy) నిలిచారు. పాలేరు(Paleru) అసెంబ్లీ నియోజకవకర్గంలో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఎన్నికల అఫిడవిట్‌లో తనకు ఉన్న ఆస్తులు, అప్పులను ప్రకటించారు.

ఎన్నికల సంఘానికి(Election Commission) సమర్పించిన అఫిడవిట్ ప్రకారం..పొంగులేటికి 32,44,27,100 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఇక ఆయన సతీమణి పేరు మీద 364 కోట్ల 51 లక్షల 2 వేల 385 రూపాయల చరాస్తులున్నాయి. అందులో తన్లా ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ సంస్థలో 236 కోట్ల 78 లక్షల 60 వేల 295 షేర్లు ఉండగా, రాఘవ కనస్ట్రక్షన్స్‌లో 47 కోట్ల రూపాయల విలువైన షేర్లు ఉన్నాయి.

2019లో పొంగులేటి ఆదాయం రూ. 29. 47 లక్షలు ఉండగా.. 2020లో ఆయన ఆదాయం ఏకంగా రూ. 12.60 కోట్లకు పెరిగింది. మళ్లీ 2023లో రూ. 32.07 లక్షలకు ఆదాయం పడిపోయింది. మూడేళ్లలో రూ. 12 కోట్లకుపైగా ఆదాయాన్ని తగ్గించి చూపారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భార్య మాధురి ఆదాయం రూ.3.4 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఆయన భార్య ఆదాయం కూడా రూ. 63 లక్షలు తగ్గినట్లు అఫిడవిట్ లో తెలిపారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక పొంగులేటి దగ్గర ఉన్న నగదు
కేవలం 12.62 లక్షలు ఉండగా.. ఆయన భార్య దగ్గర ఉన్న నగదు 5.51 లక్షలు మాత్రమే. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్యాంక్‌ అకౌంట్‌లో 2.46 కోట్ల రూపాయలు ఉన్నాయి. అలాగే ఆయన సతీమణి అకౌంట్‌లో రూ.1.20 కోట్లు ఉన్నాయి.

ఇక..పొంగులేటి శ్రీనివాస్‎రెడ్డి దగ్గర రూ. 2,85,000 విలువైన 50 గ్రాముల బంగారం ఉంది. ఆయన సతీమణి దగ్గర 2 కోట్ల 43 లక్షల రూపాయల విలువైన మూడున్నర కేజీల బంగారం, వజ్రాలు ఉన్నాయి. అలాగే 7.5 లక్షల రూపాయల విలువైన 10 కేజీల వెండి కూడా ఉంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పొంగులేటి శ్రీనివాస్‎రెడ్డి దంపతుల ఆస్తి మొత్తం 433 కోట్ల రూపాయలు.

ఎన్నికల అఫిడవిట్‎లో కేవలం ఆస్తులే కాదు.. అప్పుల వివరాలను కూడా పొందుపరిచారు ఆస్తులేకాదు.. అప్పులు కూడా భారీగానే ఉన్నాయి. పొంగులేటికి 4,22,72,411 కోట్ల రూపాయల అప్పు ఉంటే..ఆయన సతీమణి పేరు మీద 39,30,51,803 కోట్ల రూపాయలు అప్పు ఉంది. మొత్తం కలిపి ఇద్దరి పేరు మీద 43,53,24,214 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్టు అఫిడవిట్‎లో వెల్లడించారు.

Updated On 10 Nov 2023 8:21 AM GMT
Ehatv

Ehatv

Next Story