తెలంగాణ రాజకీయాలలో హాట్ టాఫిక్‌గా మారిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల ఎపిసోడ్‌కు తెరపడింది. గడిచిన కొన్నినెలల పాటు అభిమానులు, అనుచరవర్గం, సహచరులతో సుదీర్ఘంగా జరిపిన చర్చలు, విశ్లేషణల అనంతరం.. వారు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.
తెలంగాణ రాజకీయాల(Telangana Politics)లో హాట్ టాఫిక్‌గా మారిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(jupally Krishna Rao)ల ఎపిసోడ్‌కు తెరపడింది. గడిచిన కొన్నినెలల పాటు అభిమానులు, అనుచరవర్గం, సహచరులతో సుదీర్ఘంగా జరిపిన చర్చలు, విశ్లేషణల అనంతరం.. వారు కాంగ్రెస్(Congress)లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఢిల్లీ(Delhi)లో కాంగ్రెస్ అధిష్ఠానం(Congress High Command)తో సోమవారం భేటీ అయ్యారు. అనంతరం పొంగులేటి, జూపల్లి మీడియాతో మాట్లాడారు. జులై 2న ఖమ్మం(Khammam)లో భారీ బహిరంగ సభ(Public Meeting) ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఖమ్మంలో జరిగే సభకు రావాలని రాహుల్ గాంధీ(Rahul Gandhi), ఖర్గే(Mallikarjuna Kharge)ను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఓ లిస్ట్ విడుదల చేసింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్‌లో చేరుతున్న వారిలో.. మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు(Payam Venkateshwarlu), కోరం కనకయ్య(Koram Kanakaiah), కోట రాంబాబు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నర్సారెడ్డి కుమారుడు రాకేష్‌రెడ్డి, గుర్నాథ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, తాడిపర్తి సాయి చరణ్ రెడ్డి, మేఘా రెడ్డి తూడి, కూర అన్న కిష్టప్ప, ముద్దప్ప దేశ్‌ముఖ్, జూపల్లి అరుణ్, సూర్య ప్రతాప్ గౌడ్, కల్యాణ్ కుమార్ కొత్త, దండు నరసింహ, సానే కిచా రెడ్డి, గోపిశెట్టి శ్రీధర్, సేర్య, మువ్వా విజయ బాబు, తెల్లం వెంకట్రావు, పిడమర్తి రవి, జారే ఆదినారాయణ, బానోత్ విజయ, తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని స్వర్ణ కుమారి, డొర్రా రాజశేఖర్, కోటా రాంబాబు, వుక్కంటి గోపాల రావు, డాక్టర్ రాజా రమేశ్, అల్లూరి వెంకటేశ్వర రెడ్డి, హనుమండ్ల ఝాన్సీ రెడ్డి, రఘునాథ యాదవ్, రాఘవేంద్ర రెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, సుతగాని జైపాల్ వున్నారు.