Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో భార్యభర్తలు, అన్నదమ్ములు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly elections) ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతున్నది. కాంగ్రెస్(congress) నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థుల రేసులో ఉన్న నేతలంతా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విషయాన్ని అలా ఉంచితే కొన్ని ఆసక్తికరమైన ఫలితాలు కూడా వచ్చాయి. మామ ఓడిపోయారు.. అల్లుడేమో గెలిచారు. తండ్రి ఓడారు.. కొడుకు గెలిచారు. అలాగే భార్యభర్తలిద్దరూ, అన్నదమ్ములిద్దరూ విజయాలు సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly elections) ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతున్నది. కాంగ్రెస్(congress) నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థుల రేసులో ఉన్న నేతలంతా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విషయాన్ని అలా ఉంచితే కొన్ని ఆసక్తికరమైన ఫలితాలు కూడా వచ్చాయి. మామ ఓడిపోయారు.. అల్లుడేమో గెలిచారు. తండ్రి ఓడారు.. కొడుకు గెలిచారు. అలాగే భార్యభర్తలిద్దరూ, అన్నదమ్ములిద్దరూ విజయాలు సాధించారు. వివరాల్లోకి వెళితే పాలకుర్తి(Palakurthi) నియోజకవర్గంలో బీఆర్‌ఎస్(BRS) తరఫున పోటీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు(Errabelli Dayakar Rao) అనూహ్య ఓటమి ఎదురయ్యింది. ఓటమెరుగని ఎర్రబెల్లికి యంగ్ డైనమిక్ లేడి యశస్వినీ ఝాన్సీ రెడ్డి(Yashaswini Jhansi Reddy) షాక్ ఇచ్చారు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన యశస్విని తనను ఓడిస్తారని ఎర్రబెల్లి కూడా ఊహించి ఉండరు. బలంగా వీచిన కాంగ్రెస్ గాలిలో కొట్టుకుపోయారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్‌పై ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లి దయాకర్ సొంత అల్లుడు మదన్‌మోహన్‌రావు(Madan Mohan Rao) విజయం సాధించారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే మల్కాజ్‌గిరి(Malkajgiri) నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మైనంపల్లి హనుమంతరావు(Mainampally hanumanth Rao) ఓడిపోవడం, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేసిన ఆయన కొడుకు మైనంపల్లి రోహిత్(Mainampally Rohith) విజయం సాధించడం! ఈసారి తెలంగాణ అసెంబ్లీలో భార్యభర్తలిద్దరిని చూడబోతున్నాం. హుజూర్‌నగర్ నుంచి పోటీచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Utham Kumar Reddy) విజయం సాధించారు. కోదాడ నుంచి పోటీ చేసిన ఆయన భార్య పద్మావతి రెడ్డి(Padmavati Reddy) కూడా గెలుపొందారు. చాలా అరుదైన సందర్భం ఇది! ఉమ్మడి నల్లొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ గెలిచారు. అసెంబ్లీలో తమ సత్తా చూపబోతున్నారు. నల్లొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధిస్తే ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి గెలుపొందారు.