అసెంబ్లీ(Assembly) ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలను(Youth Congress Leaders) పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ భృతి(Unemployment Benefit) వెంటనే ఇవ్వాలని
అసెంబ్లీ(Assembly) ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలను(Youth Congress Leaders) పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ భృతి(Unemployment Benefit) వెంటనే ఇవ్వాలని.. ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ వైపు దూసుకొస్తున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి(Shivasena Reddy), నగర అధ్యక్షుడు మోత రోహిత్(Metha Rohith) సహా ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.