చైన్ స్నాచింగ్ చేశాడనే అనుమానం తో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారించి విడిచి పెట్టారు . ఆ తర్వాత తీవ్ర ఆనారోగ్యం తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు . దీంతో పోలీసులే చిత్ర హింసలు పెట్టి ..ఇష్టం వచ్చినట్లు కొట్టడం తోనే మృతి చె౦దాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు . మెదక్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి . […]

చైన్ స్నాచింగ్ చేశాడనే అనుమానం తో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారించి విడిచి పెట్టారు . ఆ తర్వాత తీవ్ర ఆనారోగ్యం తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు . దీంతో పోలీసులే చిత్ర హింసలు పెట్టి ..ఇష్టం వచ్చినట్లు కొట్టడం తోనే మృతి చె౦దాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు . మెదక్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి .

మెదక్ లోని అరబ్ గల్లీలో జనవరి 27 న గుర్తు తెలియని దుండగుడు ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్ళాడు. ఆ పరిసరాల్లోని సీసీ పుటేజీలను పరిశీలించారు పోలీసులు . అయితే ఆ వ్యక్తి పాత నేరస్తుడైన మహ్మద్ ఖదీర్ అని అనుమాని౦చారు. అయితే మెదక్ లో ఓ చిన్న పాన్ షాప్ నడుపుకునే మహ్మద్ ఖదీర్ ..అది సరిగా నడవక పోవడం తో గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని తన సోదరి ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు . ఖదీర్ గురించి ఆరా తీసిన పోలీసులు జనవరి 29న హైదరాబాద్ వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు . మెదక్ టానాకు తరలించి 5 రోజుల పాటు అదుపులోకి ఉంచుకున్నారు . ఏమి తేలక పోవడం తో ఫిబ్రవరి ౩ న మెదక్ తహసీల్దార్ ఎదుట బై౦డోవర్ చేసి వదిలేసారు .

అయితే పోలీస్ లు వదిలేసిన తర్వాత ఖదీర్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు . ఫిబ్రవరి 6న మెదక్ హాస్పిటల్లో చేరాడు . పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ ...బలమైన దెబ్బలు తగిలి కిడ్నీలు చెడిపోయాయని , మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని సూచించారు . హైదరాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ లో ౩ రోజుల పాటు వైద్యం చేయి౦చారు . కానీ ఖదీర్ పరిస్థితి విషమించడం తో ఫిబ్రవరి 12 న మృతి చెందాడు , దొంగతనం నెపం తో పోలీస్ లు తన భర్తను దారుణం గా కొట్టి చంపారని..చావుకు కారణమైన పోలీస్ లపై హత్యా కేసు నమోదు చేయాలనీ ఖదీర్ భార్య సిద్దేశ్వరి డిమాండ్ చేసారు. దీనిపై మెదక్ ఎస్పీకి కంప్లైంట్ చేసారు . తన భర్తను అకారణం గా చంపి , తన ముగ్గురు పిల్లలను రోడ్డున పడేసారు పోలీసు లు అంటూ ఆమె రోదించడం అందరిని కంటతడి పెట్టించింది .

Updated On 18 Feb 2023 5:55 AM GMT
Ehatv

Ehatv

Next Story