హనుమకొండ జిల్లా కాజీపేట(Kazipet) రహమత్‌నగర్‌లో రెండు నెలల కిందట 68 ఏళ్ల కన్నె విజయను దారుణంగా హత్య చేశారు. పోలీసులు ఈ హత్యోదంతాన్ని ఛేదించారు. నిందితులను గుర్తించారు. స్థానికంగా నివాసం ఉంటున్న మహిళనే విజయను హత్య(Murder) చేసి, ఆధారాలు(evidence) లేకుండా చేసినట్టు పోలీసులు గుర్తించారు. యూట్యూబ్‌లో(Youtube) చూసి ఆధారాలు లభించకుండా చేసిందట! నిందితురాలి ఇంట్లో గుర్తించిన రక్తపు మరకల ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు.
హనుమకొండ జిల్లా కాజీపేట(Kazipet) రహమత్‌నగర్‌లో రెండు నెలల కిందట 68 ఏళ్ల కన్నె విజయను దారుణంగా హత్య చేశారు. పోలీసులు ఈ హత్యోదంతాన్ని ఛేదించారు. నిందితులను గుర్తించారు. స్థానికంగా నివాసం ఉంటున్న మహిళనే విజయను హత్య(Murder) చేసి, ఆధారాలు(evidence) లేకుండా చేసినట్టు పోలీసులు గుర్తించారు. యూట్యూబ్‌లో(Youtube) చూసి ఆధారాలు లభించకుండా చేసిందట! నిందితురాలి ఇంట్లో గుర్తించిన రక్తపు మరకల ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు. వివరాల్లోకి వెళితే, గత ఏడాది డిసెంబరు 15న కన్నె విజయ హత్యకు గురైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. పోలీసులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నారు. కాజీపేట ఇన్‌స్పెక్టర్ సార్ల రాజు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. విజయ కుటుంబ సభ్యులను, కాలనీవాసులను, వలస కూలీలను విచారించారు. కాల్ డేటా ద్వారా సుమారు 60 వేల ఫోన్ కాల్స్‌ను పరిశీలించినా ఒక్క ఆధారం లభించలేదు. చివరికి హతురాలి ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఇంట్లో లభించిన రక్తపు మరకల ఆధారంగా విచారణ జరిపారు. ఆమెనే హత్య చేసినట్లు గుర్తించారు. కన్నె విజయ కుటుంబ సభ్యురాలిపై సమీపంలో నివాసం ఉంటున్న మహిళ నిందలు వేయడంతో గొడవలు జరిగాయి. ఆమెతో పాటు మరో ఇద్దరితో విజయ ఘర్షణ పడ్డారు. మరుసటి రోజే విజయ హత్యకు గురయ్యారు. నిందలు వేసిన మహిళ తన ఇంట్లోనే విజయను తీవ్రంగా కొట్టి చంపి, ఆధారాలు లభించకుండా మృతదేహాన్ని నీళ్లతో కడిగి హతురాలి ఇంటి ముందు పడేసి కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చేలా చేసింది.