అమీర్‌పేట (Ameerpet)లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో రింకీ (Rinky) అనే యువతి పనిచేస్తోంది. సరూర్‌నగర్ (Saroor Nagar)కు చెందిన శ్రవణ్ (Sravan)తో రింకీకి పరిచయమైంది. రింకీ-శ్రవణ్ కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో కానీ కొంత కాలంగా రింకీతో శ్రవణ్ దూరంగా ఉంటున్నాడు.
అమీర్‌పేట (Ameerpet)లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో రింకీ (Rinky) అనే యువతి పనిచేస్తోంది. సరూర్‌నగర్ (Saroor Nagar)కు చెందిన శ్రవణ్ (Sravan)తో రింకీకి పరిచయమైంది. రింకీ-శ్రవణ్ కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో కానీ కొంత కాలంగా రింకీతో శ్రవణ్ దూరంగా ఉంటున్నాడు. ఇది తట్టుకోలేని యువతి.. మాజీ ప్రియుడిని జైలు (Prision)కు పంపాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం పెద్ద స్కెచ్చే (Sketch) గీసింది. అతడిని గంజాయి (Ganja) కేసులో ఇరికించాలన్న రింకీ పన్నాగాన్ని చూసి పోలీసులకే మైండ్ బ్లాకైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
రింకీ తన ఫ్రెండ్స్‌తో కలిసి 4 వేల రూపాయలతో 40 గ్రాముల గంజాయిని మంగళ్‌హాట్‌లో కొనుగోలు చేసింది. గంజాయిని ఐదు ప్యాకెట్లలో నింపింది. తన స్నేహితులతో కలిసి శ్రవణ్‌కు ఫోన్ చేయించి అమీర్‌పేటలోని ఓ పార్క్ (Park) వద్దకు పిలిపించింది. అక్కడి నుంచి తన స్నేహితులు, శ్రవణ్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్(Pub)కు వెళ్లారు. ఇదే సమయంలో రింకీ తనకు తెలిసిన కానిస్టేబుల్ (Constable)కు ఫోన్ చేసి.. శ్రవణ్ ఇక్కడ గంజాయి విక్రయిస్తున్నాడని.. కారు నెంబర్ (Car Number)తో పాటు ఆ కారులోనే గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు తెలిపింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారును తనిఖీచేయగా గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో శ్రవణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. నేను ఇతరు కారులో ఇక్కడికి వచ్చానని.. తనకు, గంజాయి ప్యాకెట్లతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. దీంతో పోలీసులు కారులో వెళ్లినవారందరినీ విడివిడిగా విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. తనను దూరం పెట్టాడన్న కోపంతోనే ఎక్స్ (Ex BoyFreind)బాయ్‌ఫ్రెండ్ శ్రవణ్‌ను ఇరికించేందుక రింకీనే కుట్ర పన్నిందని పోలీసులు తేల్చారు. ఈ కేసులో రింకీతో పాటు, మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.