హైదరాబాద్‌ నార్సింగి డ్రగ్స్‌ కేసులో(Nursing Drugs case) పట్టుబడిన లావణ్య(Lavanya) కేసులో పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో లావణ్యది ప్రధాన పాత్ర కావడంతో ఆమె బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు.. సినీ రంగంలో(Movie Industry) లావణ్యకున్న పరిచయాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసు రిమాండ్‌ రిపోర్టులో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. లావణ్యకు ఉనిత్‌ రెడ్డి, ఇందిర సహాయపడినట్లు పోలీసులు గుర్తించారు. లావణ్య బ్యాచ్‌ ఒక గ్రాముకు రూ.6 వేల చొప్పున డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు తేలింది.

హైదరాబాద్‌ నార్సింగి డ్రగ్స్‌ కేసులో(Narsingi Drugs case) పట్టుబడిన లావణ్య(Lavanya) కేసులో పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో లావణ్యది ప్రధాన పాత్ర కావడంతో ఆమె బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు.. సినీ రంగంలో(Movie Industry) లావణ్యకున్న పరిచయాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసు రిమాండ్‌ రిపోర్టులో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. లావణ్యకు ఉనిత్‌ రెడ్డి, ఇందిర సహాయపడినట్లు పోలీసులు గుర్తించారు. లావణ్య బ్యాచ్‌ ఒక గ్రాముకు రూ.6 వేల చొప్పున డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు తేలింది.

ఉన్నత చదువుల కోసం విజయవాడ నుంచి లావణ్య హైదరాబాద్‌ వచ్చింది. కోకాపేటలో మ్యూజిక్‌ టీచర్‌గా(Music teacher) పనిచేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది. ఇప్పటికే పలు పొట్టి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇలా టాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఆమె జల్సాలకు అలవాటు పడింది. ఈ క్రమంలోనే ఓ టాలీవుడ్‌ హీరోకు పరిచయమైన లావణ్య.. అతడి ప్రియురాలిగా మారింది. లావణ్య మొబైల్‌తో పాటు, సోషల్‌మీడియా అకౌంట్లు, ఆమె చాటింగ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య మొబైల్‌లో పలువురు సింగర్స్‌, సినీ రంగానికి చెందిన ప్రముఖుల నెంబర్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. దీంతో ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో వరలక్ష్మి టిఫిన్స్‌ అధినేతపై నమోదైన డ్రగ్స్‌ కేసులో లావణ్య పేరు కూడా బయటకొచ్చింది. కానీ ఆ సమయంలో దొరకలేదు.

అప్పటి నుంచి లావణ్యపై పోలీసులు నిఘా పెట్టారు. డ్రగ్స్‌ తీసుకెళ్తుందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్యను తనిఖీ చేయగా హ్యాండ్‌ బ్యాగులో నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ లభించాయి. ఆమెను విచారించగా.. ఉనిత్‌ రెడ్డి అనే వ్యక్తి గోవా నుంచి తీసుకొచ్చి డ్రగ్స్‌ ఇచ్చినట్లుగా తెలిపింది. ఉనిత్‌ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య కేవలం డ్రగ్స్‌ తీసుకుంటుందా? లేదా సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా విక్రయిస్తుందా? అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Updated On 30 Jan 2024 7:47 AM GMT
Ehatv

Ehatv

Next Story