కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై కేసు నమోదు అయింది. చెరుకు సుధాకర్ కుమారుడు సుహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ జిల్లా కేంద్రం వన్ టౌన్ పరిధిలోని పిఎస్ లో ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు అయినట్లు సమాచారం.దీంతో ఒక్కసారిగా నల్లగొండ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. గత కొంతకాలంగా నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అంశాలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెరుకు సుధాకర్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. ఇరువురు […]

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై కేసు నమోదు అయింది. చెరుకు సుధాకర్ కుమారుడు సుహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ జిల్లా కేంద్రం వన్ టౌన్ పరిధిలోని పిఎస్ లో ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదు అయినట్లు సమాచారం.దీంతో ఒక్కసారిగా నల్లగొండ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి.
గత కొంతకాలంగా నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అంశాలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెరుకు సుధాకర్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. ఇరువురు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. ఇప్పటికీ చాలాసార్లు రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది.

నిన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెరుకు సుహాన్ కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో అంశాల ఆడియో వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ విషయంపై చెరుకు సుధాకర్ కాంగ్రెస్ రాష్ట్ర అధినాయకత్వానికి తెలియజేశారు.వెంటనే పార్టీ వెంకట్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడిన తీరును పలువురు నాయకులు ఖండించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆడియో అంశంపై స్పందించారు. తాను అలా మాట్లాడలేదని తెలియజేశారు. చెరుకు సుధాకర్ కావాలని తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఆడియో వైరల్ కావడంతో చెరుకు సుధాకర్ కు మద్దతుగా అనేక బిసి, ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. వెంకట్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఇరువురి మధ్య నెలకొన్న గొడవలు ఎలా సమసిపోతాయో చూడాలి.దీనిపై రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందో చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Updated On 7 March 2023 1:36 AM GMT
Ehatv

Ehatv

Next Story