ఓ వ్యక్తిని మోసం చేసి 3 లక్షల రూపాయలు కాజేసిన ఘటన మధురానగర్(Madhura Nagar) పీఎస్ పరిధిలో జరిగింది. ఆయుర్వేద వైద్యం(Ayurvedic treatment) చేస్తే వెన్నునొప్పి నయమవుతుందని నమ్మబలికి రూ.3 లక్షలు ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు. దీంతో లబోదిబోమంటూ పోలీసులను బాధితులు ఆశ్రయించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కోకాపేటకు చెందిన 70 ఏళ్ల వయసున్న రామావతార్ గుప్త(Ramavatar Gupta) గత కొంత కాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారు.
ఓ వ్యక్తిని మోసం చేసి 3 లక్షల రూపాయలు కాజేసిన ఘటన మధురానగర్(Madhura Nagar) పీఎస్ పరిధిలో జరిగింది. ఆయుర్వేద వైద్యం(Ayurvedic treatment) చేస్తే వెన్నునొప్పి నయమవుతుందని నమ్మబలికి రూ.3 లక్షలు ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు. దీంతో లబోదిబోమంటూ పోలీసులను బాధితులు ఆశ్రయించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కోకాపేటకు చెందిన 70 ఏళ్ల వయసున్న రామావతార్ గుప్త(Ramavatar Gupta) గత కొంత కాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కడ వైద్యం చేయించినా ఎంతకూ తగ్గలేదు. గత ఏడాది జులైలో మిషన్ వాక్ ఫిజియోథెరపీ సెంటర్‌లో ఫిజియోథెరపీ చేయించుకుంటుండగా సుధాకర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తన బంధువు కూడా వెన్నునొప్పితో బాధపడుతుంటే ఆయుర్వేద చికిత్స చేయిస్తే నయమైందని కబుర్లు చెప్పాడు. తన సోదరుడు దీనిపై పూర్తి వివరాలు ఇస్తాడని తెలిపాడు.
ఆ తర్వాత రోజు భరత్ అనే వ్యక్తి వచ్చి రామావతార్ గుప్తాకు ఆయుర్వేద విధానాన్ని వివరించాడు. కల్యాణ్నగర్‌లోని శారద కాంప్లెక్స్‌లో ఉన్న బాలాజీ ఆయుర్వేద దుకాణానికి తీసుకెళ్లి అక్కడ ఆయుర్వేద వైద్యుడిగా చెప్పుకుంటున్న ఆనంద్‌కు పరిచయం చేవారు. దీంతో కచ్చితంగా వెన్నునొప్పిని నయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చికిత్సలో ప్రత్యేక ఆయుర్వేద మూలికలు వాడుతామని.. విలువైన ఔషధాలతో పాటు స్వర్ణ భస్మం వాడుతామని తెలిపాడు. ఈ చికిత్సకు రూ.3.80 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపాడు. ఇందుకు చెక్కు లేదా 24 క్యారెట్ల బంగారం ఇవ్వాలని కోరాడు. తమ వైద్యంలో స్వర్ణ భస్మం వాడుతామని అందుకు బంగారం ఉపయోగపడుతుందని తెలిపారు.
వెన్నునొప్పి నయం కాకుంటే 80 శాతం తిరిగి చెల్లిస్తామని బాండ్ పేపర్ కూడా రాసుకున్నారు. దీంతో వీళ్ల మాటలను నమ్మిన రామావతార్ గుప్తా కొడుకు సచిన్ గుప్తా 3 లక్షల రూపాయలు చెల్లించి ఆయుర్వేద ఔషధాలను ఇంటికి తీసుకెళ్లి తన తండ్రికి ఇచ్చారు. నెలలు గడుస్తున్నా వెన్నునొప్పి నయం కాకపోవడంతో సచిన్ గుప్తా వారిని నిలదీశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయుర్వేద షాప్‌ను మూసివేసి అక్కడ నుంచి పరారాయ్యారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితుడు మధురానగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు