గన్‌పార్క్‌(Gunpark) దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం డబ్బులు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్దామని సీఎం కేసీఆర్‌కు(KCR) టీపీసీసీ(TPCC) అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సవాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే.

గన్‌పార్క్‌(Gunpark) దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం డబ్బులు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్దామని సీఎం కేసీఆర్‌కు(KCR) టీపీసీసీ(TPCC) అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సవాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్రమాణం చేసేందుకు వచ్చిన రేవంత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల‌కు(Police), రేవంత్ రెడ్డికి మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేప‌థ్యంలో రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా..ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలి. 17 న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు నేను వస్తా.. కేసీఆర్ నువ్వు అక్కడికి రా.. ప్రమాణం చేద్దామని” సవాలు విసిరారు. సవాల్ కు అనుగుణంగా.. రేవంత్ రెడ్డి కొద్దిసేప‌టి క్రితం అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు.

Updated On 17 Oct 2023 3:18 AM GMT
Ehatv

Ehatv

Next Story