సీజ్ చేసిన డ్రగ్స్‌ను(Drugs) కొట్టేసిన ఎస్సైను(SI) పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్ ను ఇంట్లో దాచిన రాయదుర్గం(Raidurg) ఎస్సై రాజేందర్(SI Rajender ) ఆ తర్వాత అమ్ముకోవాలని ప్లాన్ చేశాడు. కోర్టులో డిపాజిట్ చేసే సమయంలో వ్యవహారం బయటపడింది
సీజ్ చేసిన డ్రగ్స్‌ను(Drugs) కొట్టేసిన ఎస్సైను(SI) పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్ ను ఇంట్లో దాచిన రాయదుర్గం(Raidurg) ఎస్సై రాజేందర్(SI Rajender ) ఆ తర్వాత అమ్ముకోవాలని ప్లాన్ చేశాడు. కోర్టులో డిపాజిట్ చేసే సమయంలో వ్యవహారం బయటపడింది. సీజ్ చేసిన డ్రగ్స్ పరిమాణం కంటే తక్కువగా కనిపించడంతో పోలీసులు అనుమానంతో రాజేందర్ ను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
గతంలో డ్రగ్స్ నిందితులను పట్టుకునేందుకు మహారాష్ట్రకు వెళ్లిన టీమ్‌లో సైబర్ క్రైం ఎస్సై రాజేందర్ కూడా వున్నాడు. ఈ క్రమంలోనే నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ లో కొంత మాయం చేశాడు ఎస్సై. విచారణలో డ్రగ్స్ ను తన ఇంటి లాకర్ లో దాచిపెట్టినట్టు.. కొద్దిరోజుల తరువాత డ్రగ్స్ అమ్మాలనుకున్నట్లు వెల్లడించాడు రాజేందర్. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు.. రాజేందర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.