బుద్దిగా చదువుకోండ్రా అని తల్లిదండ్రులు కన్నకష్టం చేసి కాలేజీలో చేర్పిస్తే కొందరు తప్పుడుదారి పడుతున్నారు.

బుద్దిగా చదువుకోండ్రా అని తల్లిదండ్రులు కన్నకష్టం చేసి కాలేజీలో చేర్పిస్తే కొందరు తప్పుడుదారి పడుతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగులకు(Online betting) బానిసై.. అప్పులు(Debts) తీర్చడానికి చైన్ స్నాచింగ్(Chain snatching) చేసిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు(Students), ఒక లెక్చరర్(Lecturer) అరెస్ట్ చేశారు పోలీసులు. నల్గొండకి(Nalgonda) చెందిన బొంత అనిల్ కుమార్ అనే ఉపాధ్యాయుడు ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడి తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాడు.. అయితే అప్పులు తీర్చే మార్గం లేక చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. మరొక దగ్గర మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి పౌల్ట్రీ ఫార్మ్ నడుపుతూ ఆన్‌లైన్ బెట్టింగులకు బానిస అయ్యాడు.. అప్పటికే భూములు అమ్మి 20 లక్షలు అప్పు తీర్చినప్పటికీ మిగతా అప్పు తీర్చడానికి చైన్ స్నాచింగ్ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. మరొక చోట ప్రభాస్ అనే వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగుల వల్ల అయిన అప్పులు తీర్చడానికి చైన్ స్నాచింగ్‌ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

Updated On 18 Nov 2024 10:15 AM GMT
Eha Tv

Eha Tv

Next Story