హైదరాబాద్‌లో(Hyderabad) ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా హైడ్రా(Hydra) మారింది.

హైదరాబాద్‌లో(Hyderabad) ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా హైడ్రా(Hydra) మారింది. ఆక్రమణలను, చెరువుల్లో కబ్జాచేసిన నిర్మాణాలను కూలగొడుతోంది. హైడ్రాపై కూడా నాగేశ్వర్‌ విశ్లేషణలు చేశారు. హైడ్రా చాలా చక్కగా పనిచేస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి(CM revanth reddy) సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. పలు బస్తీలకు హైడ్రా నోటీసులు కూడా ఇచ్చింది. చెరువు శిఖం భూముల్లో చిన్నచిన్న ఇళ్లు ఏర్పాటు చేసుకొని గత కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నారు. వారందరికీ నోటీసులు ఇచ్చి కూల్చివేతలు ప్రారంభించారు. అయితే ఈ హైడ్రాను అడ్డుపెట్టుకొని కొందరు వసూళ్లకు(Corruption) పాల్పడుతున్నారు. గత రెండు రోజుల కిందనే ఓ వ్యక్తి రూ.20 లక్షలు డిమాండ్‌ చేసి హైడ్రా రాకుండా చూస్తానని చెప్పారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ వార్తలు బయటకు రావడంతో హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు వంపిస్తామని హెచ్చరించారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలంటూ రంగనాథ్ సూచించారు. హైడ్రాను తప్పుదోవ పట్టించే విధంగా యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ రంగనాథ్ హెచ్చరించారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలన్నారు. అటువంటి ఇన్‌ఫార్మర్ల పేర్లు గోప్యంగా, సురక్షితంగా ఉంచుతామని ఏసీబీ డీజీ పేర్కొన్నారు.

Eha Tv

Eha Tv

Next Story