ఓ వ్యక్తి పెద్ద పారిశ్రామికవేత్తగా బిల్డప్‌ ఇస్తాడు. అంతేకాదు మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో తనొక పెద్ద వ్యాపారినంటూ ప్రొఫైల్‌ క్రియెట్‌ చేస్తాడు. ఆ వెబ్‌సైట్లలో అప్పటికే నమోదు చేసుకున్న యువతుల కోసం వల వేస్తాడు. ఇందుకు తన భార్య కూడా సహకరిస్తుంది. అవసరాన్ని బట్టి తన ప్రతిభాపాటాలను బయటకు తీస్తుంది. ఇద్దరు కలిసి యువతులను ట్రాప్‌లో పడేసి వారి దగ్గర అందినంత దోచుకొని పారిపోవడం.. ఇదే ఈ దంపతుల వృత్తి. ఈ ఘరానా మోసం బయటపడడంతో సీసీఎస్‌ స్పెషల్‌ జోన్‌ క్రైం టీం(CCS Special Zone Crime Team) పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు. సీసీఎస్‌ డీసీపీ శ్వేత వెల్లడించిన వివరాల ప్రకారం..

యెలిగంటి రంజిత్‌ అలియా రాకేష్‌(Rakesh) అలియాస్ రాధాకృష్ణకు సంధ్య అనే మహిళతో వివాహమైంది. ఈ జంట ఉప్పల్‌(Uppal) పరిధిలోని ఫిర్జాదిగూడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. ఇంతలో ఈ నిత్య పెళ్లికొడుకుకు ఓ ఐడియా తట్టింది. తన సెల్‌ఫోన్‌ చూస్తుండగా తెలుగు మ్యాట్రిమోని వెబ్‌సైట్లు ఇచ్చే ప్రకటనల పట్ల ఆకర్షితుడయ్యాడు. చాలా మంది యువతులు ఈ వెబ్‌సైట్లలో పెళ్లి కోసం తమ వివరాలు పొందుపర్చిన విషయాన్ని గుర్తించాడు. యాప్‌లలో తన ప్రొఫైల్స్‌ అప్‌లోడ్‌ చేసేవాడు. తనకు తాను ఓ బిల్డర్‌నంటూ, ఓ రియల్‌ఎస్టేట్‌ వెంచర్‌ ఓనర్‌నని, ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. దీనికి అతని భార్య సంధ్య(Sandhya) కూడా చేదోడువాదోడుగా నిలిచింది. అప్పటి పరిస్థితులను బట్టి తన వేష, భాషలు మార్చేది. యువతులకు నమ్మకం కుదిరిన తర్వాత బయట ఎక్కడైనా కలుద్దామని ప్రస్తావిస్తాడు. మెల్లగా మాటల్లో పెట్టి తన డబ్బు ఒక దగ్గర స్ట్రక్‌ అయిందని అత్యవసరంగా డబ్బు అవసరమైందని యువతుల ఎదుట నమ్మబలుకుతాడు. ఎమర్జెన్సీగా డబ్బులు కావాలంటూ యువతుల దగ్గర నుంచి అందినకాడికి తీసుకుంటాడు. వెంటనే తిరిగిఇస్తానని లేదా కట్నం డబ్బుల కింద ఇవి మినహాయించుకోవచ్చని సాకులు చెప్తాడు. డబ్బు తిరిగి ఇవ్వకపోగా మనిషే దొరకకపోవడంతో మోసపోయామని కొందరు యువతులు గ్రహించారు.

ఈ వ్వవహారంపై కొందరు బాధితులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ భిక్షపతి ఆధ్వర్యంలోని బృందం విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితులను లక్షల రూపాయాల్లో మోసం చేసినట్లు తేలింది. ఈ దంపతుల వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఇంకా ఈ జంట బారినపడి మోసపోయినవారు ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. మ్యాట్రీమోనీ సైట్లలో ఉన్న ప్రొఫైల్స్‌ను ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని.. పెళ్లి సంబంధాల విషయంలో మ్యాట్రిమోనీ సంస్థలు కూడా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Updated On 14 March 2024 1:57 AM GMT
Ehatv

Ehatv

Next Story