సిరిసిల్ల(sircilla) జిల్లా వేములవాడ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన నాగరాజుకు ఓ కోరిక ఉంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉంటున్న నాగరాజు టూ వీలర్ మెకానిక్‌గా(Mechanic) పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాడు పడ్డాడు. ఎడారి నగరం దుబాయ్‌కు వెళ్లాలన్నది చిరకాల కోరిక.
సిరిసిల్ల(sircilla) జిల్లా వేములవాడ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన నాగరాజుకు ఓ కోరిక ఉంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉంటున్న నాగరాజు టూ వీలర్ మెకానిక్‌గా(Mechanic) పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాడు పడ్డాడు. ఎడారి నగరం దుబాయ్‌కు వెళ్లాలన్నది చిరకాల కోరిక. అందుకు బోల్డంత డబ్బు కావాలి. మెకానిక్ పని చేస్తూ దుబాయ్‌కు వెళ్లడం కానిపని! అందుకోసం దొంగతనాలు(Thefts) చేయాలని డిసైడయ్యాడు. తాళం వేసి ఉన్న ఇళ్లు కనబడితే ఆలస్యం చటుక్కుమని అందులో దూరేవాడు. ఇల్లు గుల్ల చేసి బయటకు వచ్చేవాడు. ఇప్పటి వరకు 38 ఇళ్లల్లో దొంగతనాలు చేశాడు. చివరకు వరంగల్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి సుమారు 22 లక్షల రూపాయల విలువైన 270 గ్రాముల బంగారు ఆభరణాలతో పటు, రెండు ద్విచక్రవాహనాలు, 50 వేల రూపాయల నగదు, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.