జాతీయ పక్షి(National Flag) నెమలిని(Peacock) బంధించకూడదు.
జాతీయ పక్షి(National Flag) నెమలిని(Peacock) బంధించకూడదు. అది మన సంపద కాబట్టి వాటిని కాపాడాలి. నెమలిని బంధించినా నేరమే! అలాంటిది నెమలిని చంపేసి కూర వండటం మహా నేరమే అవుతుంది. అందుకే సిరిసిల్లలోని(Sirrcilla) తంగళ్లపల్లికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ జైలుకు వెళ్లాడు. ఈయన ఏం చేశారంటే నెలమి కూరును ఎలా వండాలో వివరిస్తూ యూ ట్యూబ్‌లో ఓ వీడియో పెట్టాడు. ఈయన సంప్రదాయ వంటకాలపై వీడియోలు చేసి శ్రీటీవీ అనే యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం సాంప్రదాయ పద్ధతిలో నెమలి కూర ఎలా వండాలో చూడండి అంటూ ఓ వీడియో చేశాడు. దాన్ని ట్రెడిషనల్ పీకాక్ కర్రీ రెసిపీ అన్న పేరుతో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. అది చూసి జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం కూడా కోపగించుకున్నారు. దాంతో యూ ట్యూబ్ వారే ఆ వీడియోను తొలగించారు. అప్పటికే ఓ 140 మందికి పైగా ఆ వీడియో చూశారు. కోపం ప్రణయ్‌కుమారే ఇంతకు ముందు నిషేధిత జాబితాలో ఉన్న అడవిపంది కూర ఎలా ఉండాలో కూడా వీడియో తీసి అప్‌లోడ్ చేశాడు. వన్యమృగాలను, జాతీయ పక్షిని వేటాడం నేరమని తెలిసి కూడా వాటిని చంపి కూర వండటమే కాకుండా.. ఆ వీడియోలను అప్‌లోడ్ చేయడం దారుణమైన నేరం కిందకే వస్తుంది. విషయం తెలుసుకున్న సిరిసిల్ల ఫారెస్ట్ అధికారులు ప్రణయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి నెమలికూర వీడియోను స్వాధీనం చేసుకున్నారు. అతడు వండిన కూరను ల్యాబ్ టెస్ట్‌కు పంపించారు. అతడిని జైలుకు పంపించారు.National bird,food,peacock,arrest,sircilla,ehatv