పోలీసులు ఎన్ని కౌన్సిలింగ్‌లు చేసినా, ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా హైదరాబాద్ పాతస్తీలోని ఆకతాయిలలో పిసరంత మార్పు కూడా రావడం లేదు.
పోలీసులు ఎన్ని కౌన్సిలింగ్‌లు చేసినా, ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా హైదరాబాద్ పాతస్తీలోని ఆకతాయిలలో పిసరంత మార్పు కూడా రావడం లేదు. వారికి పోలీసులంటే కొంచెం కూడా భయం లేదు. లాకప్‌లో(Jail) ఉన్న ఫ్రెండ్‌ను కలవడానికి వచ్చిన ఓ యువకుడు అతడితో కలిసి రీల్(Reel) చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు పోలీసులను వారెంత లైట్ తీసుకుంటున్నారోనని! వివరాల్లోకి వెళితే ప్రేమ పేరుతో తన కూతురును ఎత్తుకెళ్లారంటూ ఓ తల్లి బండ్లగూడ పోలీసులకు కంప్లయింట్ చేసింది. స్థానికంగా ఉంటున్న మూదషీర్‌పై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు మూదషీర్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి జాడ ఇంకా తెలియకపోవడంతో మూదషీర్‌ను స్టేషన్‌లోనే పెట్టుకున్నారు. మూదషీర్‌నుకలవడానికి అతడి ఫ్రెండ్ ముబారక్ వచ్చాడు. ఇద్దరు కలిసి వీడియో రీల్ చేశారు. లాకప్‌లో ఉంటున్నప్పటికీ బాలిక కుటుంబాన్ని బెదిరిస్తూ మూదషీర్ రీల్ చేశాడు. పోలీస్ స్టేషన్‌లోనే ఫ్రెండ్స్‌తో రీల్స్ చేయిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇవన్నీ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన బాలిక కుటుంబసభ్యులు పోలీసులపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూదషీర్‌కు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్టేషనలో పోలీసుల ముందే రీల్స్ చేస్తున్నాచర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.