కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య(Podem Veeraiah) సీపీఐ నేత‌ల‌(CPI Leaders)పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐ నేతలే కుట్ర పన్ని నన్ను ఓడించారని అన్నారు. సీపీఐ నాయకులు చివరి నిమిషంలో పార్టీ మారి తనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్లే నేను స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడి పోయానన్నారు.

కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య(Podem Veeraiah) సీపీఐ నేత‌ల‌(CPI Leaders)పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐ నేతలే కుట్ర పన్ని నన్ను ఓడించారని అన్నారు. సీపీఐ నాయకులు చివరి నిమిషంలో పార్టీ మారి తనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్లే నేను స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడి పోయానన్నారు. నేను గెలుస్తానని సర్వేలు వచ్చాయి. ప్రజల నుంచీ అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఇలా పాజిటివ్ గా వున్న టైమ్ లో ఎన్నికలకు నాలుగు రోజులు ముందు సీపీఐ పార్టీ నేతలు మెయిన్ క్యాడర్ ను అంతా తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సీపీఐ నేతల నమ్మక ద్రోహం వల్లే ఓడిపోయానని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పువ్వాడ అజయ్ బంధుత్వంతో ఈ సీపీఐ లీడర్లు అంతా కుమ్మక్కై భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో దొంగ దెబ్బ తీశారని ఆరోపించారు. నేను గెలిస్తే ఉప ముఖ్య మంత్రి పదవి, మంత్రి పదవి వస్తుందని భావించి స్వార్ద రాజకీయాలతో కుట్ర పన్ని నన్ను ఓడించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గత 36 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్నా.. బీఆర్ ఎస్ పార్టీ కోట్ల రూపాయలు ఆశ చూపినా.. నేను పార్టీ మారలేదని.. కాంగ్రెస్ పార్టీకి కష్ట కాలంలో వెన్ను దన్నుగా వున్నానని వివ‌రించారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం నన్ను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని ఆశిస్తున్నాన‌ని అన్నారు.

Updated On 6 Dec 2023 6:14 AM GMT
Ehatv

Ehatv

Next Story