గద్దర్ భార్య(Gaddar Wife) గుమ్మడి విమల(Gummadi Vimala)కు ప్రధానమంత్రి మోదీ(PM Modi) లేఖ రాశారు. గద్దర్ మృతి గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానని లేఖ‌లో వెల్ల‌డించారు. తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

గద్దర్ భార్య(Gaddar Wife) గుమ్మడి విమల(Gummadi Vimala)కు ప్రధానమంత్రి మోదీ(PM Modi) లేఖ రాశారు. గద్దర్ మృతి గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానని లేఖ‌లో వెల్ల‌డించారు. తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయి. గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని కూడా అందించాయని కొనియాడారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. మీ దుఃఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేము. కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు లేఖ ద్వారా తెలియ‌జేశారు.

Updated On 25 Aug 2023 1:44 AM GMT
Ehatv

Ehatv

Next Story